Saturday, July 7, 2012

అతితెలివి ఘనాపాటి లగడపాటి !



   
  ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో నాయకులు ఎన్ని ఎత్తులేస్తారో అనే విషయానికి ఉదాహరణగా నిలిచినవాడు లగడపాటి రాజగోపాల్. స్పష్టమైన, ప్రధానమైన అభియోగాలకు సమాధానం చెప్పాల్సినవాడు చెప్పకుండా నోరుమూసుకొని తప్పించుకొని తిరుగుతుంటే..లగడపాటి లాంటి కొందరు నాయకులు మాత్రం బయటబడిన బాగోతాన్ని ఎలా సమర్ధించుకోవాలా అని తెగ పరిశోధనలు  చేసేస్తున్నారు. చట్టాలు తిరగేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...
     అక్రమార్జన కేసుకు సంబంధించి సి.బి.ఐ.విచారణ అంశాలను జే.డి.లక్ష్మినారాయణ కొన్ని మీడియాలకు ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని చేరవేశాడు అనేందుకు సాక్ష్యంగా నిలిచినా జే.డి.లక్ష్మినారాయణ కాల్ లిస్టు ను వై.కాపా.నేతలు బయటబెట్టారు. దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి జే.డి. ఆయన సమాధానం చెప్పకపోగా, ఆయన నిబద్ధత గూర్చి కొందరు సర్టిఫికేట్ ఇచ్చేస్తునారు. మనం చెప్పినట్లు,మనకోసం పనిచేసిన వ్యక్తి ఉహించని రీతిలో సమర్ధించుకోలేని వివాదంలో ఉంటే మనవాడిగా మనం ఆయనమీద వచ్చే విమర్శలు తిప్పిగొట్టా లన్నట్లు నిన్న వి.హెచ్. నేడు లగడపాటి మాట్లాడుతున్నారు. నిజమే, సి.బి.ఐ. మాన్యువల్ లోని 24 .9  , 24 .11 నిబంధనలను అనుసరించి వివిధ అంశాలను సి.బి.ఐ.మీడియాకు చెప్పవచ్చు.
అయ్యా లగడపాటి! మీ అతితెలువులు ప్రదర్శించకుండా ప్రజల ఈ సూటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి.
  •   జగన్ అరెస్ట్ ముందువరకు జే.డి.విచారణ చేస్తున్న కేసులకు సంబంధించి స్వయంగా జే.డి.నే. మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు,సన్నివేశాలు అన్ని టీవి చానెల్స్ వద్ద రుజువుగా కోకొల్లలు. ఒక్క జగన్ కేసు విషయంలోనే ...అరెస్ట్ చేసే ముందునుంచి ఇప్పటివరకు మీడియా ముందుకువచ్చి అంతకు ముందులా విచారణ విషయాలు ఏ నిబంధనలను అనుసరించి చెప్పలేదో మేథావి అయిన లగడపాటి గారూ! మీరు అజ్ఞానులైన ప్రజలకు చెప్పగలరా?
  • సరే!... సి.బి.ఐ. మాన్యువల్ లోని నిబంధనలను అనుసరించి మీడియా అందుబాటులో ఉన్నా...అంతకు ముందులాగాక ఫోన్ ద్వారా  సమాచారాన్ని చేరవేశారనుకుందాము. మీడియా ఫోన్ చేస్తే విచారణకు సంబంధించిన విషయాలు చెప్పడ్డమే పలు అనుమానాలకు దారితీస్తాయని అనుకుంటే జే.డి.నుంచి మీడియాకు కాల్స్ వెళ్ళడం ఏమిటి? ఇదేమైన జే.డి.ఇంట్లో పెళ్ళా?స్వయంగా తనే వారికి ఫోన్ చేసి అయ్యా కేసు ఇలా ఉంది అని చెప్పడానికి ?! అలా చెప్పడమే తన భాద్యత అయినప్పుడు అన్ని చానెళ్లకు చెప్పాలిగా?
  • వాసిరెడ్డి చంద్రబాల జే.డి.కి, మీడియాకు మీడియేటర్ కాదు, ఆమె చెప్పినట్లే క్లాస్మేట్ అని చెప్పినప్పుడు వస్తున్న నిందలలో నిజం లేదు...ఇదిగో జగన్ అరెస్ట్ ముందునుంచే మా ఇద్దరికీ ఫోన్ కంటాక్స్ ఉన్నాయి అని ప్రజల అనుమానాలకు నివృతి చేసేలా అటు జే.డి.గాని, ఇటు చంద్రబాల గాని ఎప్పటి నుండో సాగుతున్న   పరిచయాన్ని ద్రవపరిచే కాల్ లిస్టు ను ఇద్దరిలో ఎవరో ఒకరు  వారే స్వయంగా బయట పెట్టొచ్చుకదా జనం నమ్ముతారు? 
  • ఇప్పటివరకు ఏ మీడియా, ఏ పార్టీ  ఏ కేసులోనూ...ఏ సందర్భంలోనూ కాల్ లిస్ట్లను ప్రవేశ పెట్టలేదా? వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు ఈ కాల్ లిస్టు విషయాలో ఇంత రాద్దాంత మెందుకు?
పై విషయాలకు సమాధానం చెప్పాల్సినవారు,నిరూపించుకోవాల్సిన వారు నిరూపించుకో కుండా, తగుదునమ్మా అంటూ తెగ పరిశోధనలు చేసేసి కొండనితవ్వి ఎలుకని బట్టినట్లు ,లగడపాటి నిబంధనల నీతి కబుర్లు చెబుతున్నాడు. ఉప ఎన్నికల్లో ఎన్ని ఎత్తులేసినా జనం ముడ్డిమీద వాతబెట్టినా ఈ కాంగ్రెస్ వారికి బుద్దిరాలేదని అనుకుంటున్నారు. 

బరితెగిస్తున్న కిరణ్ సర్కార్


     జగన్ అక్రమార్జన కేసులో సి.బి.ఐ. విచారణను ఎదుర్కుంటున్న మంత్రులపట్ల రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారనే ఆలోచనని కూడా లెక్క చెయ్యకుండా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపిస్తే కేబినేట్ ఆమోదం తీర్మానంతో ఏమైనా చేసుకోవచ్చనే లెక్కలో కిరణ్ ప్రభుత్వం ఉంది. మంత్రులు ప్రజాధనాన్ని బొక్కడం ఒక నేరమని అనుకుంటుంటే...అలాంటి నేర గాళ్లుగా అరూపణలు ఎదుర్కుంటున్న మంత్రులకు న్యాయ సహాయక ఖర్చులు  ఆయా మంత్రుల శాఖలే (ప్రజాధనంతో కూడిన ప్రభుత్వమే) భరిస్తుందనే నిర్ణయం తీసుకోవడం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు.
     విచారణను ఎదుర్కుంటున్న, ఎదుర్కోబోతున్నమంత్రుల నేరారోపణ రుజువైందే అనుకో...; వారికి న్యాయ సహాయం క్రింద ఖర్చుచేసిన డబ్బును మంత్రుల వద్ద నుండి వాపసు తీసుకుంటామని ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. న్యాయ నిపుణుల సలహా,సూచనల  మేరకే ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు కూడా ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. తన ముఖ్య మంత్రి కుర్చీని కాపాడడంలో మంత్రులు సహకరించినందుకు కృతజ్ఞతగా కిరణ్ కుమార్ రెడ్డి తన సొంతధనాన్ని సంబంధిత మంత్రులకు సహాయం చేసిఉంటే ప్రజలు హర్షించేవాళ్ళు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లు ప్రజాధనాన్ని నాయకులు పంచేసుకోవడమే కాకుండా, ఇలా ప్రజధనంతోనే ఈ కేసులవల్ల తమకు ఎలాంటి ఖర్చులేకుండా కేసులనుంచి బయటబడాలని నాయకులు భావించడం ప్రజలు హర్షించని విషయం. కోతికి కొబ్బారికాయ దొరికినట్లు వై.ఎస్. మరణం పుణ్యామా అని, ఆపై సోనియమ్మ పుణ్యామా అని ముఖ్య మంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఏమి చేస్తున్నాడో... ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా బహిరంగంగానే మాట్లాడుతున్నాడు. మేథావులు, ప్రజా సంఘాలు ప్రభుత్వ నిర్ణయంపై నిరసనను తెలియ జేయాలని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.

Tuesday, June 19, 2012

విధానమండలి ని రద్దు చెయ్యండి.


రాజకీయ పునరావాస కేంద్రంగా పేరొందినది విధానమండలి. రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసినవాటిలో మేథావులు-ప్రజలు వ్యతిరేకించింది, అన్నిరాజకీయ పార్టీలకు ఉమ్మడి ప్రయోజనాత్మక మైనది  విధానమండలి. నెలకు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం తప్పించి ప్రజలకు విధానమండలి వల్ల ఇప్పటివరకు కలిగిన ప్రయోజనాన్ని ఒక్కటికూడా చూపలేము. రాజకీయనాయకుల పార్టీ పరమైన వ్యతిరేక  దూషణ లుతప్ప  రాష్ట్ర    ప్రయోజనాలకు , వ్యవహారాలకు  సంబంధించి ఒక్క అంశంమీద ప్రయోజనాత్మకమైన, సమగ్రమైన డిబేట్ జరగలేదు. ఒకప్రక్క ప్రభుత్వం డబ్బు లేదంటూ; పెన్షన్ విధానానికి మంగళం పాడి వారికి సంబంధించి మాత్రం చాలా అనుకూలంగా  పదేపదే జీతాల పెంపు, ఇతర సౌకర్యాల విషయంలో అన్ని పార్టీలు సోదర భావంతో సామరస్యంగా సత్వరమే నిర్ణయాలు తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యడంలో రాజకీయ పార్టీలన్నీ  ఒకటే అని నిరూపించాయి.నిరుపయోగమైన విదానమండలిని రద్దు చెయ్యాలని ప్రజలు,మేధావులు,రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించే వారు గట్టిగా డిమాండ్ చెయ్యాలి. సోషల్ నెట్ వర్క్స్ ద్వారా ప్రజలను మనందరం చైతన్య పరచాలని అనకాపల్లి న్యూస్ .కాం ఆశిస్తున్నాను.

Monday, June 11, 2012

చెత్త నాయకుల రొటీన్ డైలాగ్స్


     చెత్త రాజకీయ నాయకులు చెత్త డైలాగ్ లను మాత్రం వదలరు. ఏళ్ళు తరబడినా ఇలాగే మాట్లాడు తుంటారు. ఇలా మాట్లాడడమే రాజకీయం అనుకుంటారు. 
ఎన్నికల ప్రచారంలో:
  • భారీ మెజారిటీతో మా అభ్యర్దిదే ఘనవిజయం.(అన్ని పార్టీలు)
ఉప ఎన్నికలైతే:
  • ప్రతిపక్షాలు: ఈ ఎన్నికల తీర్పు రెఫరాండం గా భావించాలి.
  • పాలక పక్షం: ఈ ఎన్నికల ఫలితాలు రెఫరాండం కానేకాదు.("చక్కగా పాలించాను" అని అనిపిస్తేగాదా ధైర్యంగా ఒప్పుకోడానికి!) 
ఫలితాలు వెలువడాకా :
ఓడినోడు గెలిచినోళ్ళ నుద్దేశించి :
  • డబ్బు మందు విచ్చలవిడిగా పంచి గెలిచారు.(ఇతగాడేమీ ఇటువంటివి ఎరగనట్లు నంగనాచి మాటలు..)
ఫలితాలపై పార్టీలు:
ఓడిన పార్టీలు: 
  • వారి స్థానాలు వాళ్ళు గెలిచారు. మేము ఓడింది ఏమీలేదు.(మరెందుకు ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టిందో!)
  • మా పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది.(లేదా) మునుపటిలాగే ఉంది.(జంప్ జిలానీ అయిన నాయకుల్లా కాకుండా  పార్టీని అంటిపెట్టుకున్న ప్రజలెందరో తెలుసుకోడానికా?)
     పై విధంగా చేత్తమాటలు మాట్లాడకుండా ఉన్నవిషయాన్ని ఉన్నట్లు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. లేదంటే ఇలాగే వాతలు పెడతారు ఎన్నికలప్పుడు. 

జగన్ ప్రత్యర్థులకు తీరని కోరిక


     వై.కా.పా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో అన్ని పార్టీలు, అన్ని మీడియా లు ఒకటయ్యాయి. నిబంధనలను అతిక్రమిస్తూ అధికారులు ప్రభుత్వాధి నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. జడ్ కేటగిరి ఉన్న జగన్ ని నాలుగు రోజులపాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ లో ఎంతో బద్రతతో తీసుకువెళ్ళిన పోలీస్ అధికారులు పైఅదికారులు, నాయకుల ఆదేశాలను అనుసరించి చివరి రోజున మామూలు ఖైదీలను తీసుకు పోయే వ్యానులో కోర్టుకు హాజరు పరిచారు. అలా తీసుకు వెళ్ళడం జగన్ వ్యతిరేకులకు ఆనందాన్ని కలిగించింది.  జగన్ పై వారి అక్కసు ఎలావుందంటే ...."అంకుశం"సినిమాలో బేడీలు వేసి నడిరోద్దుమీదనుంచి నడిపించుకొని తీసుకు వెళ్ళినట్లు నిజంగానే జగన్ ను అలా తీసుకువెళ్ళా లన్నట్లు ఆశపడుతున్నారు. జగన్ వ్యవహారంలో ప్రత్యర్థులకు తీరని కోరికగా పైన ప్రస్తావించిన విషయం ఉంది పోయింది. కాంగ్రెస్  ప్రభుత్వం బరి తెగించింది అన్న దానికి ఇటువంటి ఉదాహరణలు కొల్లలు. సి.బి.ఐ. ని కోర్ట్ మొట్టికాయలు వెయ్యడంతో మరల మునుపటిలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్ లో జగన్ ను కస్టడీకి తీసుకు పోయారు.     

Tuesday, June 5, 2012

దళారులను ప్రోత్సహిస్తూ అనకాపల్లి డి.సి.ఎం.ఎస్. సిబ్బంది.

గ్రీన్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి దళారి.
కొనుగోలు దారులతో దళారి
పుస్తకాలు విక్రయిస్తున్న సిబ్బంది.

అనకాపల్లి డి.సి.ఎం.ఎస్. వారి ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విక్రయం ప్రారంభమైనది,. అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో క్యూలో పుస్తకాలకోసం నిలబడగా ఒకవ్యక్తి డి.సి.ఎం.ఎస్. సిబ్బంది సహకారంతో కౌంటర్ వద్ద నిలబడి మధ్యలో వచ్చిన వారివద్ద అదనపు డబ్బులు పుచ్చుకొని వారికి పుస్తకాలు ఇప్పించే తంతును గమనించిన అనకాపల్లి న్యూస్ .కాం "మీరెవరు" అని ప్రశ్నించగా నేను ఇక్కడి స్టాఫ్ అని చెప్పాడు. అనకాపల్లి న్యూస్ .కాం డి.సి.ఎం.ఎస్. సిబ్బంది ని వివరణ అడగగా అతను మా సిబ్బంది కాదు, సర్వీసు చేస్తున్నాడు అని చెప్పారు. దళారిలాగా వ్యవహరిస్తున్న అతనిని ప్రశ్నిస్తే స్టాఫ్  అని అతను చెప్పినప్పుడు "కాదు"అని మీరెందుకు ఖండించాలేదని డి.సి.ఎం.ఎస్. సిబ్బందిని అడగగా నీళ్ళునమిలారు. ఇక్కడ జరుగుతున్న నల్లబజారు వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపించమని అనకాపల్లి న్యూస్,కాం ఈ వ్యవహారంలో ప్రమేయమున్నవారిపై పోలీసు కేసు నమోదు చేయనున్నది.

అపర బిజినెస్ గాంధీ.


ఆ గాంధీకి "కోట్లు" లేవు. ఆ గాంధీకి మొలమీద తప్ప వంటిమీద బట్టలేదు. ఆ గాంధీకి పదవులపై ఆశ లేదు. ఈ అపర గాంధీ కి లేనిది లేదు. ఆయనెవరో కాదు, లగడపాటి. డబ్బుంటే చాలు, నాయకుడై పోవచ్చు.  ప్రజాసేవ పేరుతో అందరిలా ఆయనకూడా అలా రాజకీయాల్లోకి వచ్చినవాడే! "సమైక్యాంధ్ర" పేరుతో ఇంకాస్త వెలుగు లోకి వచ్చాడు లగడపాటి.  తనవల్లే రాష్ట్రం విడిపోకుండా ఉందని రాష్ట్ర ప్రజలకు బిల్డప్ ఇస్తున్నాడు. ఇది చాలదన్నట్లు చేతిలో జెండాను పట్టుకుని గాంధీ గారిలా పాద యాత్రలు చేస్తూ ప్రయాసపడుతున్నాడు, "నీవు మాకు ఏమిచేశావని ఓట్లు అడగడానికి వచ్చావని"అక్కడక్కడ ప్రజలచేత నిలదీయబడుతున్నాడు. కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్  రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ముఖ్యమంత్రి కాగా ఇంత చేసిన నాకేనా వీలుకానిది అనే భావనతో "ముఖ్య మంత్రి పీఠం" కోసం శ్రాయశక్తుల కృషి చేస్తున్నాడు. బహుశా బొత్సా ,చిరు సి.ఎం.పీఠం కోసం ప్రయ్తత్నిస్తుండగా నేనేమైనా తక్కువ తిన్నానా అని కాబోలు ఎన్నికల ప్రచారంలో రోజుకో కథ చెబుతున్నాడు, రోజుకో వేషం వేస్తున్నాడు. వై  .ఎస్.మరణాంతరం సి.ఎం.పీఠం ఎంత చులకనైంది?!      

వాన్ పిక్ బాధితులపై కాంగ్రెస్ ఓట్ల గాలం


ప్రకాశం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వాన్ పిక్ బాధితుల కు ఆశ చూపి ఓట్లుగా మలుచుకునే పనిలో బిజీగా ఉన్నారు. విచారణలో,వివాదంలో,కోర్ట్ పరిధిలో ఉన్న ఈ వ్యవహారాన్ని తను ముఖ్యమంత్రి దృష్టికి ,కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి పరష్కరిస్తానని బాధితులకు ఆశచూపుతున్నాడు.ప్రజలకు నామమాత్రంగా ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకొని ఎవరి భూములు వారికి ఇస్తారా ? అలాంటిది ఎమీలేకుండానే ఎవరి భూములు యధావిధిగా వారికే ఇస్తారా? ఎప్పటిలోపు ఇస్తారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం పి.ఎం.కూడా ఇవ్వలేడు. మరి మంత్రిగారు అరకపట్టి ఏరువాక అని వాన్ పిక్ ఏకరువు పెడుతున్నారెందుకంటే కేవలం ఓట్ల కోసమే ! ఎన్నికలయ్యాక మంత్రి గారిచ్చిన మాటపై కార్యరూపం  దాల్చనప్పుడు భాదితులు నిలదీసే రోజువస్తుంది. ఇది సత్యం.        

సామాజిక న్యాయం చేసుకున్న చిరంజీవి.



సామాజిక న్యాయం కోసమే పార్టీ అంటూ "ప్రజారాజ్యం" పార్టీని స్థాపించి కలలోకూడా ఉహించని రీతిలో పరాభవం చెందిన మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం సిగ్గులేకుండా కాంగ్రెస్ లో ఇమిడి పోయారు. " కాంగ్రెస్ వారిని పంచలూడదీసి తరిమి కొట్టండి" అని పిలుపునిచ్చిన యువరాజ్యం నేత, చిరంజీవి సోదరుడు  పవన్ కళ్యాణ్ పార్టీ విలీనం అనంతరం "సిగ్గుతో" అన్న రాజకీయ వ్యవహారాలకు దూరమయ్యాడు. చిన్నవాడికున్న సిగ్గు చిరంజీవికి లేక పోయిందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.  అవినీతి పార్టీ అని ప్రజలకు చాటిచెప్పిన చిరంజీవి తిట్టిన పార్టీలోనే  విలీనం చేశారు తన పార్టీని.  పార్టీ లోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులైన గంటా శ్రీనివాసరావు కి, సి.రామచంద్రయ్య కు మంత్రి పదవులు, తనకి రాజ్యసభ పదవీ తెప్పించుకొని నిజంగా సామాజిక న్యాయం చేసుకున్నాడు. చిరంజీవి అమాయకుడు, రాజకీయం తెలియదు అనుకున్న జనానికే మతిపోయేలా "తెలుగుదేశం  అవినీతికి కిటికీ తెరిస్తే, కాంగ్రెస్ తలుపులే తెరిసింది " లక్షలాది ప్రజలమధ్యలో కాంగ్రెస్ ను విమర్శించిన చిరంజీవి అదే పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. అవినీతి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోవడం కాకుండా కాంగ్రెస్ అవినీతి పార్టీ అని చెప్పిన అదే ప్రజలకు కాంగ్రెస్ కు ఓటు వెయ్యండి అని చిరంజీవి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.  ఒకమారు ఓడినంత మాత్రాన ఐదేళ్ళు ఆగలేని నాయకుడు ప్రజలకేమి సేవచేస్తాడని ప్రజలే రాజకీయంలో రాటుదేలిన చిరంజీవి తీరును చూసి ఆశ్చర్య పోతున్నారు. 

పురంధేశ్వరి !మీది అధికార దాహం కాదా?!



నీడపట్టున హాయిగా కూర్చునే నాయకుల్ని ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం  ఉపఎన్నికల ప్రచారానికి బలవంతంగా పంపించింది. జగన్ న్నే  టార్గెట్ గా  చేసుకొని మాట్లాడమని నాయకుల్ని నియోజక వర్గాలపైకి వదిలింది. అలవచ్చిన కేంద్రమంత్రి పురంధేశ్వరి జగన్ ది అధికార దాహం అని ఆరోపణలు చేసింది. నిజమే! మరి "మీది అధికార దాహంకాదా " అని ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేసి ప్రశ్నిస్తున్నారు.తండ్రి నందమూరి తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ అయిన తెలుగు దేశంలో కాకుండా, అధికారం కోసం ఎ పార్టీ అయితే ఏమి అనే ఆలోచనతో...పదవీ కాంక్ష ఉన్నప్పుడు పార్టీ సిద్దాంతాలతో పనిలేదనే అభిప్రాయంతో కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవిని పొందింది. ఇది అధికార దాహంకాదా అని పురంధేశ్వరి ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలుగు దేశం పగ్గాలు చంద్రబాబు చేతికి పోయాక బాబుతో పోటీపడలేని ఈ దంపతులు రామారావు పేరుతో కాంగ్రెస్ లో పదవిని పొంది అనుభవించేది అధికార దాహంకాదా అని మేథావులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వాలూ ...ప్రజలు గమనిస్తున్నారు!!


కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపితంగా అనుసరిస్తున్న ద్వంద వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్న నాయకులను కేంద్రం పార్టీలను బట్టి , కొందరితో కేంద్రప్రభుత్వానికున్న అభిప్రాయ బేధాల్ని బట్టి సి.బి.ఐ.ద్వారా విచారణ చేయిస్తుంది, ఐ.టి.దాడులు చేయిస్తుంది. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే  ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంత అవినీతికి పాల్పడ్డా ప్రభుత్వం రక్షిస్తుంది అని నాయకులకు ధీమాను కలుగ జేస్తుంది కేంద్ర ప్రభుత్వం. లిక్కర్ సిండికేట్ వ్యవహారం లోనూ, ఓక్స్ వ్యాగన్ వ్యవహారాలలో ఆరోపణలు ఎదుర్కుంటున్న బొత్స సత్యనారాయణ సి.బి.ఐ.గూర్చి భయంలేక పోగా తన వ్యవహారంలో దూకుడుగా ప్రదర్శిస్తున్న పోలీస్ ఆఫీసర్నే మార్పించాడు ప్రభుత్వం అండతో. వై.ఎస్.ఆర్. ఆత్మగా చెప్పుకునే కే.వి .పి. రామచంద్ర రావు కాంగ్రెస్ తరఫున ప్రచారంలో మునిగిపోయారు గాని సి.బి.ఐ.కి సంబంధించిన భయం లేదు. కంటితుడుపుగా మంత్రి మోపిదేవిని పట్టించుకో పోయినా చాలామంది మంత్రులను కేంద్రం కాపాడుకుంటూ వస్తుంది. జైలు పాలైనందుకు మోపినేనికి బహిరంగంగానే సహచర ప్రజాప్రతినిధులు  సానుభూతిని ప్రకటిస్తున్నారు. పార్టీలు సారా పోయించినా, డబ్బులు పంచినా ఎ రూపంలో ప్రలోభ పెట్టిన ఓటరు ఓటింగు రోజున ఇటువంటి ద్వంద వైఖరిని ప్రదర్శించే పార్టీలకు బుద్ధి చేబుతారనేది నగ్న సత్యం.  

2014 ప్రధాని పదవి రాహుల్ గాంధీకి కలే!


భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భవించి, స్వాతంత్ర్యానంతరం నెహ్రు కుటుంబం స్వార్థం కోసం రాజకీయ పార్టీగా మలిచబడిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ.  ఇటువంటి కాంగ్రెస్ పార్టీ     2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి వారసత్వంగా రాహుల్ గాంధీని ప్రధానిపదవిలో కూర్చోబెట్టాలని వ్యూహం పన్నుతుంది. ఇది జరగని పని అని కాంగ్రెస్ వారు గ్రహించడం లేదు. ఈ మూడేళ్ళ పాలనా కాలం లో అనేక కుంభకోణాలు, ప్రజా వ్యతిరేక పనులు, అధిక ధరలు, చట్టాలను అనుకూలంగా మలుచుకొని వ్యవహరించిన తీరు. ఇటువంటివెన్నో ఇటీవలి కాలంలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి తార్కాణం. తన కుమారుడ్ని ప్రధానిగా చూసుకోవాలనే కోరిక సోనియాగాంధికి ఉంటే ఈ రెండేళ్ళ సమయాన్నైనా ప్రధాని పదవిగా ఉపయోగించుకుంటే మంచిదని మేథావులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాని పదవిని తృణప్రాయంగా సోనియమ్మవదిలేసినట్లు కాంగ్రెస్ వారు సోనియాను త్యాగ మూర్తిగా అభివర్ణిస్తున్నారు. విదేశీయులు దేశ ప్రధాని లాంటి అత్యున్నత పదవి స్వీకరించ కూడదని బి.జే.పి.వారు తీవ్రంగా విమర్శించడంతో, దేశంలో ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో (మన్మోహన్ సింగ్ ను బొమ్మలా కూర్చోబెట్టి) ప్రధాని అధికారాలను సోనియా చలాయిస్తున్నారు అనే విషయాన్నీ ప్రజలు గ్రహించలేని అమాయకుల్ల అనామక నాయకులు అమాయకంగా మాట్లాడుతున్నారు. ఈసారి వారసత్వంగా గాంధీ కుటుంబం నుంచి ప్రధాని రావడాని ప్రజలు నిరోదించే క్రమంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ముందస్తు హెచ్చరికగా ప్రజలు కాంగ్రెస్ కు భవిష్యత్తును తెలియజేశారు.

Monday, June 4, 2012

ద్వందనీతి కాంగ్రెస్



కేంద్రమంత్రి గులాం నబి ఆజాద్ ప్రచారం చేస్తూ "రాజు మరణిస్తే కుమారునికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టటానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు" అని అన్నారు. ఇందిరాగాంధీ మరణించిన వెంటనే రాజీవ్ గాంధీని ప్రధానిగా ఏ ఉద్దేశంతో ఏమని చేశారో సమాధానం చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు ఒకనీతి, బయటివారికి ఒక నీతి. కాంగ్రెస్ వారి ఈ ద్వంద నీతిని ప్రజలు తిరస్కరిస్తున్నారు.       

హడలెత్తి పోతున్న ఇటలీ కాంగ్రెస్ సేన.



జరగనున్న 18 స్థానాల ఉపఎన్నికలు ఇటలీ కాంగ్రెస్ సేనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.గతంలో ఏ ఎన్నికలకు  కాంగ్రెస్ నియోజక  వర్గాల వారిగా  ఇంతమందిని ఇంచార్జ్ లుగా నియమించింది లేదు. అలా నియమింప బడినవారు ఇంత కష్టబడి పనిచేసిందీ లేదు. సర్వ శక్తులువొడ్డి నాయకులు నియోజకవర్గాలు తిరుగుతున్నారు. అయినా జనాలు లేక వెలవెల బోతున్నాయి వారి రోడ్ షోలు. ఇక్కడి ఎం.ఎల్.ఏ.లు,ఎం.పీ.లు, మంత్రులు సరిపోలేదు అన్నట్లు కేంద్రమంత్రి గులాం నబి ఆజాద్ ను ప్రచారంలో దించారు. అయినా రోడ్ షో లు లో జనాలు అరకొరే. సోనియా గాంధీ బొమ్మబెట్టుకొని గెలిచాము అని సిగ్గు లేకుండా పచ్చిగా చెప్పిన ఈ నాయకులు స్వయంగా సోనియాగాంధీని ప్రచారానికి తీసుకొచ్చినా పరాభవం తప్పదంటున్నారు కొందరు వై.కా.పా.నేతలు. ప్రజలను ప్రలోభపరిచే ఎన్ని మాటలు చెప్పినా ఎన్నికలలో అంతిమ విజయం తమాదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నారు వై.కా.పా. నేతలు.

పార్టీలకు అతీతంగా...

తెలుగు దేశం పత్రికగా ముద్రపడిన "ఈనాడు", బాబు బినామి పత్రిక గా బయట ప్రజలు అనుకునే "ఆంధ్రజ్యోతి" పార్టీలకు అతీతంగా(వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మినహాయించి) జగన్ కేసు వెలుగులో కొచ్చినది మొదలు వార్తలు ప్రచురించడం ప్రజలకు విస్మయాన్ని కలుగ జేస్తుంది. అన్ని పార్టీల ఉమ్మడి శత్రువు జగన్ అన్నట్లు అన్ని పార్టీలవారు స్నేహితుల్లా వ్యవహరిస్తున్నారు. జగన్ గూర్చి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఈ పేపర్లలో వార్తగా చోటుచేసుకుంటున్నాయి. ఏది ఏమైనా జగన్ వ్యవహారం ద్వారా ఏకమైన ఈ నాయకుల ఈ రకమైన స్నేహం, ఈ పత్రికలు వారి మాటకు విలువిస్తూ ప్రచురించే ఈ వార్తల అనుబంధం ఎంతకాలం నిలిచి ఉంటుందో వేచి చూడాలి.

కేంద్రం కనుసన్నల్లో కీలక శాఖలు



సి.బి.ఐ.కేంద్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తుంది అని ఇటీవల జగన్ వ్యవహారంలో మాత్రమే సి.బి.ఐ. వ్యవహరిస్తున్న తీరునుబట్టి ఇట్టే అర్థమై పోయింది. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా...పనిచేసినా ఇటలీ కాంగ్రెస్ చట్టాన్ని తనచేతిలోకి తీసుకొని బెదిరిస్తుందని నిరూపించే మరో తాజా సంఘటనే బాబా రాందేవ్ ట్రస్ట్ వ్యవహారాలలో వివిధ శాఖలు వ్యవహరిస్తున్న తీరు. కేంద్రప్రభుత్వం అవినీతి పై, అనేక విషయాలపై ఆరోపణలు గుప్పిస్తూ అన్నా హజారే  ,బాబా రాందేవ్ సంయుక్తంగా దీక్ష చేస్తున్నందుకు కేంద్రప్రభుత్వం ప్రతిచర్య మొదలైంది. 58 కోట్లు కట్టాలని ఐ.టీ.శాఖ,  యోగా శిభిరాలద్వార వచ్చిన ఆదాయంపై 4.94  కోట్లు సేవా పన్ను కట్టాలంటూ సేవా పన్ను విభాగం వారు రాందేవ్ కు  దీక్ష చేస్తున్న ఈ సమయంలో నోటీసులు ఇవ్వడం వెనుకున్న కేంద్రప్రభుత్వం ప్రమేయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సి.బి.ఐ. నే కాదు, ఐ.టీ.శాఖ, సేవా పన్ను విభాగం  ఇలా ఏ శాఖలనైనా తమ స్వప్రయోజనాలకు వాడుకుని బెదిరించే కాంగ్రెస్ నైజాన్నిగమనించవచ్చు. నిజంగా రాందేవ్ అంత డబ్బు కట్టాలే అనుకుందాము. మరి ఇన్నాళ్ళు నోటీసులు ఇవ్వకుండా ఈ శాఖలు మౌనంగా ఎందుకున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.ఉద్యోగులుగా విధులను ఇంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు,మేథావులు డిమాండ్ చేస్తున్నారు. కాలం దగ్గరబడినప్పుడు పార్టీలు ఇలానే వ్యవహరిస్తాయని ప్రజలు అనుకుంటున్నారు.

Sunday, May 27, 2012

Y.S.Jagan Arrest by C.B.I.

జగన్ అరెస్ట్ అప్రజాస్వామికం. కాంగ్రెస్ పార్టీ జగన్ ని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఉపఎన్నికల సమయంలో అరెస్ట్ చేసింది అని ప్రజలు భావిస్తునారు.

Thursday, May 24, 2012

బరితెగించి మాట్లాడుతున్న మంత్రులు


     రాష్ట్రంలో సి.బి.ఐ.జరుగుతున్న అవినీతి విచారణ తంతు రోజుకొక మలుపు తిరుగుతుంది. తాజాగా రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి మోపి దేవి వెంకట రమణా రావు అరెస్ట్ ఉదంతం తో మంత్రులు అయోమయంలో పడి ఏమి మాట్లాడుతున్నామో అనేది కూడా ఆలోచించకుండా బరితెగించి మాట్లాడుతున్నారు. నిన్న  మోపి దేవి వెంకట రమణా రావు , రేపు నేను (మేము) నేను అరెస్ట్ కావచ్చు అనే ధోరణితో రాష్ట్ర మంత్రులు "మోపిదేవికి అండగా ఉంటాం"అని అని బహిరంగంగా రాష్ట్ర మంత్రివర్గం అనడంటే ప్రజలంటే, ప్రజాస్వామ్యమంటే భయం లేని వారి తత్వాన్ని గ్రహించ వచ్చు. ప్రతిపక్షాలు, వ్యతిరేకులను అరెస్ట్ చేస్తే "విచారణ  కదా! తప్పు చెయ్యనప్పుడు భయమెందుకు?" అని దీర్ఘాలు తీసి మాట్లాడే ఈ అవినీతి మంత్రులకు, దోపిడీ నాయకులకు ఎందుకింత భయం. తర్వాత వంతు మీదనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్న నాయకులను (పాలకపక్షం వారిని తప్పించి) ఎవరినైనా విచారించ వచ్చు. చట్టం తమ పని తాము చేసుకు పోతున్నారని శాంతి సంరక్షకుల్లా, నీతి కోవిదులులా మాట్లాడే నాయకులకు ఇప్పుడు ...చ్చ పడుతుందా? ఐ.ఏ.ఎస్. లు, నాయకులు ఎంత అవినీతి చేసినా విచారించ కూడదు. నాయకుల వైఖరికి నిరసనగా ప్రజలు ఏకమై నాయకుల అవినీతిపై గళ మెత్తాలి. అవినీతి మంత్రులకు మిగతా మంత్రులే కాదు,ప్రతిపక్షం వారు కూడా అండగా నిలిచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. నాయకుల జీత భత్యాల పెంపు, పెన్షన్ మొదలగు ఉమ్మడి ప్రయోజనాల విషయంలో వివిధ పార్టీల, నాయకుల వాదోప వాదనలు, వాక్ అవుట్ లు లేకుండా స్వల్ప వ్యవధిలోనే బిల్లు లు పాస్ అవుతాయి. ఎందుచేతనంటే వారందరి ప్రయోజనం. జనం సోమ్మేగా! అనే భావన.
     నోట్లో వేలు పెడితే కొరక లేని అమాయక చక్రవర్తులు మన రాష్ట్ర మంత్రులు."మాకేమైనా మేలు జరిగిందా?", "కేవలం సంతకాలు చేసినందుకే ఇంత తీవ్ర చర్యలా?" .ఇవి సదరు మంత్రులు పాపం పసిపిల్లల్లా మాట్లాడే మాటలు.  "అవినీతి చెయ్యనప్పుడు మీకు భయమెందుకు?" "అవినీతి చెయ్యనప్పుడు మీ ఆస్తులపై సి.బి.ఐ.ని విచారణ చేపట్టమనండి. ఆర్థికంగా మేము లబ్ది పొందలేదని నిరూపించు కొండి!" అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు వణికి పోయే నాయకులను.మంత్రి వర్గం లోని 
ప్రతి ఒక్కరి ఆర్ధిక వ్యవహారాలపై సి.బి.ఐ. కూలంకషంగా విచారణ చెయ్య వలసిందిగా  అనకాపల్లి న్యూస్ .కామ్ పజల పక్షాన డిమాండ్ చేస్తుంది. 

Wednesday, May 23, 2012

పారదర్శకత లేని వ్యవస్థలు

    
     వివిధ ఆరోపణలను ఎదుర్కొనే వారిని, వివిధ శాఖలు అదుపులోకి తీసుకోవడం ఒక సంచలనాత్మకమైన వార్తగా అన్ని న్యూస్ ఛానెల్స్, దిన పత్రికలు పతాక శీర్షికలతో రాస్తుంటారు. రెండు మూడు రోజులు హంగామాగా చేస్తుంటారు. ఫలానా తారా చౌదరి కేసులో ఫలానా టి.డి.పి. ఎం.ఎల్.ఎ.రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది అని మీడియానే చెబుతుంది. తారా చౌదరి కొందరి ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు కథనాలు ప్రసారం చేస్తాయి. దమ్ముంటే నిరూపించ మనండి అని ఆరోపణలు ఎదుర్కునే వారు సవాలు విసురుతారు. ఈ హడావిడంతా రెండు మూడు రోజులే! ఆ తర్వాతా ఆ కేసు ఊసే ఉండదు. లొంగిపోయిన నిందితులు  ,నిందితురాలు నుంచి పోలీసులు ఏమి సమాచారాన్ని రాబట్టారో, ఏ ఏ ప్రశ్నలు సంధించారో పోలీసువారికి, సిబి ఐ వారికి తప్పించి మూడో కంటికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు.  వాస్తవాల ఆధారంగా 'నిందితులు  శిక్షార్హులు' అనేదే విచారించే శాఖల ప్రధాన ఉద్దేశ్యమైతే విచారణను పారదర్శకంగా చెయ్యవచ్చుకదా? మీడియాను అనుమతించి విచారణను వీడియోగా చిత్రికరించవచ్చు. సమాజంలో ఒకమోస్తరు గుర్తింపు వున్న వ్యక్తి చస్తే స్మశానానికి వెళ్లి లైవ్ టెలికాస్ట్ చేసే చానెళ్ళు ఎటూ ఉన్నాయి. అవి విచారణ తంతును టెలికాస్ట్ చేస్తాయి.  లేదా విచారణాదికారులు   మీడియాకు విచారణ కు సంబంధించిన సి.డీ.లను ఇస్తే ప్రసారం చేసుకుంటాయి. ఇదంతా పార దర్శకంగా ఉండాలనే భావన ప్రభుత్వానికి,ఆయా శాఖలకు  ఉంటే సాధ్యం కానిది, చట్ట విరుధమైనది కాదు. ఇలా చేస్తే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ప్రయోజనం ఉండదుకదా? ఎన్నో కేసుల్లో పెద్దవాళ్ళ పేర్లు మొదట వినిపించాయి. ఆ తర్వాతా వాళ్ళ ఊసే ఉండదు. ఈ లోపే ప్రభుత్వ స్థాయిలో, పోలీసు బాసుల స్థాయిలో రావాల్సిన అవగాహనకు వారు వచ్చి ఒప్పందాలు కుదిరిపోతాయి. ఇప్పుడు తాజాగా జగన్ అక్రమ  ఆస్తుల  కేసుకు సంబంధించి జరిగే విచారణ కూడా గోప్యంగా ఉంది. కే.వి.పి.లాంటివారు ప్రభుత్వానికి అనుకూలురుగా ఉంటూ తననూ సి.బి.ఐ.విచారణ చేస్తారేమో అనే విచారమే లేకుండా హాయిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు (చేయిస్తున్నారు). వోక్స్ వెగన్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న బొత్స కూడా నీతిపరుడే! లిక్కర్ సిండికేట్ విచారణ నుంచి ఛాక చక్యంగా బొత్స సి.బి.ఐ.ని బుజ్జగించి తప్పించుకున్నాడు. ఇవేవీ అక్రమార్జన కేసులు కాదు అన్నట్లు సి.బి.ఐ.లక్ష్మీ నారాయణ వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వానికి ధిక్కార స్వరం వినిపించిన వారే ఇప్పుడు విచారణను ఎదుర్కుంటున్నారు. మంత్రులను విస్మరించి అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. మంత్రులలో కొందరినైనా విచారించక పోతే ప్రజలనుంచి విమర్శలు వస్తాయని సి.బి.ఐ. కొందరు మంత్రులను పెళ్ళికి పిలిచినట్లు పిలుస్తుంది. హోం శాఖా మంతిరి అలా  పిలిపించి విచారణ మమా అనిపించారు. వారు వీడియా ముందుకు వచ్చి సి.బి.ఐ.వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చాను అని కూల్ గా సమాధానం చెప్పి వెళుతున్నారు, అవినీతికి తాము ఆమడ దూరం అన్నట్లు!
     కనుక విచారణ భాగోతాలను వివిధ దశలలో కాకున్నా విచారణ మొత్తాన్ని కోర్టు స్థాయికి వెళ్ళే సందర్భంలోనైన ప్రజాస్వామ్య వ్యవస్థలో గొప్పదైన ప్రజా కోర్టుకు తెలియ జేసే ప్రయత్నం సి.బి.ఐ.చెయ్యాలి. లేదా ప్రముఖ పౌర సమాజం సభ్యుల సమక్షంలో విచారణ జరిగినప్పుడే సి.బి.ఐ.ని, పోలీసు వ్యవస్థను ప్రజలు విశ్వసిస్తారు.
  

కాంగ్రెస్ కు కాలం చెల్లనుంది


కేంద్ర ప్రభుత్వ పనితీరు చూస్తే కేంద్రప్రభుత్వానికి కాలం చెల్లనుందని అర్థమౌతుంది. గడిచిన మూడు సంవత్సరాలలో ప్రజలకు వారు ఏమి సేవచేశారానో ఆ సంబరాలు. దినదిన గండంగా ప్రభుత్వాన్ని ఈ మూడేళ్ళు నెట్టు కొచ్చినందుకే  ఈ సంబరం అన్నట్లు దేశరాజధానిలో సంబరం చేసుకున్నారు. వెనువెంటనే పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచారు. కుంభ కోణాల యు.పి.ఏ.ప్రభుత్వం పెట్రోల్ కంపెనీలనుంచి ఎంత ముడుపులు అందుకొని ఉన్న పళంగా పెట్రోల్ ధరలు పెంచారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా ఓడిపోతుందని తెలిసే మిగిలిన రెండు సంవత్సరాలలో ఇష్టా రాజ్యంగా దేశాన్ని దోచుకోడానికి వెనుకాడడం లేదు. ప్రజలకు భయపడడం లేదు. అదేమంటే  కాంగ్రెస్ జాతీయ పార్టీ. 130  సంవత్సాల పై చరిత్రగల పార్టీ  అని గొప్పలు చెప్పు కుంటున్నారు. ప్రతి ఊరిలో పుట్టకూ గుట్టకూ కూడా ఏళ్ల చరిత్ర వుంటుంది. నియంతలకూ,మహనీయులకు చరిత్ర ఉంటుంది. అందుకే ఇందిరా గాంధీ కాలంనాటి ఎమర్జెంసీ రోజులను తలపింపజేస్తూ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా కేంద్రంలో  యు.పి.ఏ.ప్రభుత్వం , ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. సోనియా కుటుంబం, కుటుంబమే పిల్లా పాపలతో వెళ్లి ఉత్తర ప్రదేశ్ లో ప్రచారం చేస్తే ప్రజలు తిరస్కరించినా సిగ్గు రాలేదు. భోఫోర్సు కుంభకోణం తెరమీదకి రాకుండా ఉండాలంటే  సోనియాగాంధీ రాజకీయంలో ఉండకతప్పదన్నట్లే వ్యవహరిస్తుంది. అసలు కాంగ్రెస్ నాయకుల ఆస్తులు ఎవరెవరివి ఎంతెంత స్విస్ బ్యాంక్ లో మూలుగుతున్నాయో ఊహకి అందడం లేదు. స్విస్ బ్యాంక్ లోని నల్ల ధనాన్ని భారత్ కి రప్పించడం అలా ఉంచండి, ఆ ధనాన్ని దేశ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టడం అలా ఉంచండి. కనీసం....భారతీయుల స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్లు కూడా  యు.పి.ఏ.ప్రభుత్వం ప్రకటించలేక పోయిందంటే కాంగ్రెస్ నాయకుల ఖాతాలు ఎందరివి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Friday, May 18, 2012

ముఖ్య మంత్రి అధికార దుర్వినియోగం


ఉప ఎన్నికల వేళ పాలక పక్షం వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తెలివిగా మంత్రులను ఉపఎన్నికలు జరిగే నియోజక వర్గాలకు ఇంచార్జ్లుగా నియమించడంతో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు సదరు మంత్రిగారిదగ్గరకి క్యూ కడుతున్నారు.ఇది ఇలా ఉంటే స్వయంగా ముఖ్య మంత్రే ఎన్నికల ప్రచారం చెయ్యడం జరుగుతుంది. ఈ పని అతని పార్టీకి సంబంధించినదే అయినప్పటికీ ఈ సందర్భంగా 
  • ముఖ్య మంత్రి వినియోగించే వాహనాలు ఏమిటి?
  • ముఖ్య మంత్రి విడిది చేసే బంగ్లాలు,వసతుల మాటేమిటి?
  • ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా వినియోగించే కాన్వాయ్ మాటేమిటి?
ఇవన్నీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే పనులే. మే 19 , 2012 న నెల్లూరు జిల్లా ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా జన సమీకరణ లో భాగంగా మంత్రుల ఆదేశంతో అధికారులు ఉపాది హామీ పథకం క్రింద పనిచేసే వారిని ఈ సభలకు తరలించారు. ప్రజా ధనాన్ని ఇలా పార్టీపరంగా ఉపయోగించుకున్నారు. ముఖ్య మంత్రి ఒక పార్టీకి చెందిన నాయకుడే కావచ్చు. ముఖ్య మంత్రి ఎవరు?ఎ పార్టీకి చెందినా వారు అనే భేదం లేకుండా ఉప ఎన్నికల వేళ   ముఖ్య మంత్రిగా ఉన్నవారు ప్రచారానికి వెళ్ళడానికి వీలులేదు అనే చట్టాన్ని తీసుకు రావాల్సి ఉంది. చిన్న చిన్న విషయాలకు కోడ్ ఉల్లంఘన అని గోల చేసే "ఎన్నికల సంఘానికి, అధికారులకు" జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగం, నాయకుల  స్వప్రయోజనాలకోసం ఖర్చై పోతున్న ప్రజా ధనం గూర్చి ఆలోచనే లేదు. ఈ విషయానికి సంబంధించి మేథావులు ఆలోచించాలి. ప్రజా ధనాన్ని పరిరక్షించాలి. 

Thursday, May 17, 2012

అప్రజాస్వామికంగా ప్రభుత్వం...



వై.ఎస్.మంత్రి మండలి 

జగన్ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యకు దిగినట్లు సామాన్యులకు సైతం స్పష్టమౌతుంది. గత ఉప ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ వారికి ఇంకా సిగ్గు రాలేదని గ్రహించాలి.. మరలా ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేని రాష్ట్ర కాంగ్రెస్ కేంద్రం సహకారంతో, సి.బి.ఐ.ని తన ఆయుధంగా మలుచుకొని వ్యక్తిగతంగా జగన్ పైకి దాడికి దిగింది. ఇప్పటివరకు అభియోగం మోపబడిన వారినెందరినో సి.బి.ఐ. విచారించింది వేరు వేరు కేసుల్లో. విచారణ జరుగుతున్న దశలో ఏవొక్క కేసులోనూ విచారింప బడుతున్న వారి ఆస్తులను అటాచ్ మెంట్ కోరుతూ సి.బి.ఐ. ప్రభుత్వాన్ని అడిగిన సందర్భాలు పెద్దగ లేవు. సి.బి.ఐ.అడిగిందే తడవుగా అన్నింటిలోను నత్తనడకను ప్రదర్శించే ప్రభుత్వం వెను వెంటనే వారి అభ్యర్థనను ఆమోదించిన సందర్భాలూ లేవు. ఈ పరిణామాలన్నీ కక్ష సాధింపు చర్యలని రుజువు చేస్తున్నాయి.

సి.బి.ఐ. విచారణ లోనే ఎన్నో లోపాలు:
సి.బి.ఐ.వారు చిత్త శుద్ధితో కేసు విచారణ చెయ్యడం లేదు. కారణం అత్యున్నత కోర్టు స్థాయిల్లో వారి వాదన ఓడిపోతుంది. వారికి తెలిసినా ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశం గనుక!

ఇలా విచారించాలిగాదా!:
  • వ్యక్తిగతంగా కొందరికి లబ్ది చేకూర్చినందుకే వారు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని; అలా జగన్ కోట్లాది రూపాయలు కూడబెట్ట డన్నదే ప్రధాన అభియోగం. అప్పటి ముఖ్య మంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంత్రివర్గ ఆమోద ముద్రతోనే ఇవి చేసినప్పుడు మంత్రి వర్గంలోని మిగతా మంత్రులను సి.బి.ఐ. విచారించక పోవడాన్ని ఏమనాలి?
  • కొందరికి వ్యక్తిగత ప్రయోజనాన్ని కలిగించినందుకు ముట్టిన ప్రతిఫలాన్ని ఒక్క వై.ఎస్.మాత్రమే పొందగా మిగతా మంత్రులు ఎటువంటి ప్రయోజనాలు పొందకుండా అందులో వాటాలేకుండా ఉండే అంత అమాయక చక్రవర్తులా? నోరులేనివారా? నిస్వార రాజకీయ నాయకులా?
  • జగన్ స్థాయిలో మంత్రివర్గం లోనివారికి కంపెనీలు లేకపోవచ్చు. వై.ఎస్. వాళ్ళ లబ్ది పొందినవారు ఇలాంటి మంత్రులకు వారికివ్వాల్సిన వాటాను పెట్టుబడులుగా కాకపోయినా ధనరూపంలో నైన ఇచ్చి ఉండాలిగా? అది తెలుసు కోడానికి మంత్రి వర్గంలోని అందరి ఆస్తులపై సి.బి.ఐ.దర్యాప్తు చెయ్యాలిగా? అలా చెయ్యడం లేదు ఎందుకు?
  • మంత్రివర్గం జారీచేసిన జీ.ఓ.లను అమలుచేసిన అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్నప్పుడు, ఆ జీ.వో.లకు సూత్రధారులైన అప్పటి మంత్రి వర్గం లోని వారిని జగన్ ని విచారిస్తున్న పద్దతిలోనే సి.బి.ఐ.వారు అప్పటి మంత్రులను ఎందుకు విచారించడం లేదు?
ప్రతిపక్షాలు, మేథావి వర్గాలు ఏం చేస్తున్నారు:


న్యాయానికి విరుద్ధంగా ఒకరికి ఒక పద్ధతి, మరికొందరికి మరో పద్ధతి అన్నట్లు వ్యవహరిస్తున్న సి.బి.ఐ.ని ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదు. ఏ ఒక్క పార్టీ  విమర్శలు గుప్పించడం లేదు. అప్పటి మంత్రి వర్గం వారందరిపై ఇటువంటి విచారణనే చేపట్టామని గట్టిగా అడగక పోవడానికి కారణం అన్ని పార్టీల ఉమ్మడి శత్రువు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ, దాని నాయకుడు జగన్. మీడియాలో మాట్లాడుతున్న నాయకుల మాటల్ని గమనిస్తుంటే రాష్టంలో జగన్ తప్పించి అందరూ పవిత్రులు, దోపిడీ అంటేనే తెలియదన్నట్లు మాట్లాడు తున్నారు. నిజం రుజువు చేసుకోడానికి ఏ ఒక్కరు సి.బి.ఐ.ని ఆహ్వానించరు కదా...ఎవరైనా ఫలానా మంత్రిని విచారణ జరపమని అంటే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటారు. బొత్సా లాంటి వారి బండారం బయటపడుతున్న దశలో కీలకమైన, ఖచ్చితమైన సిన్సియర్ ఆఫీసర్లు ప్రమోషన్ల పేరుతో మాయమై పోతారు. రాజకీయ నాయకులు సరే...మేథావి వర్గం ఏమి చేస్తున్నారు? ఎందుకు మౌనం?

Monday, May 14, 2012

నాటి ఆంధ్రదేశపు అ(ప్ర)ధమ పౌరుడు


కాంగ్రెస్ హై కమాండ్  పంపగా మన రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్ గిరి వెలగబెట్టేందుకువచ్చి ఘనకార్యం చేసి ఘనుడు తివారీ . అతగానికి ఇలాంటి ఘన చరిత్రలు దేశంమొత్తం మీదా చాలానే ఉన్నాయని లోక విదితం. పెద్దోళ్ళ కొక న్యాయం, పేదోళ్ళ కొక న్యాయమన్నట్లు న్యాయస్థానాలు వ్యవహరిస్తున్నాయి. తివారినే తన తండ్రి. కావాలంటే డి.ఎన్.ఏ. పరీక్ష చేసి నాకు న్యాయం చెయ్యండి అని రోహిత్ శర్మ మూడు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నాపోలీస్ శాఖా, న్యాయ శాఖలు మౌనంగా ఉండిపోయాయి. ఇన్నాళ్ళకి కాస్త కోర్టు కళ్లెర్రజేస్తూ రక్త పరీక్షకు నిరాకరించే తివారిని హెచ్చరించింది. నేటి రాజకీయ నాయకులకు పదవులు రక్షణ కవచంలా ఉపయోగపడడం , ఆ అండతో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలనీ సాగించడం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి తివారీలు నేటి రాజకీయ రంగంలో తక్కుమందేమి లేరు. డిల్లీ హైకోర్ట్ ఇచ్చిన రెండురోజుల గడువులోపు రక్త పరీక్ష ఇచ్చి నేరం రుజువు కాబడి పరువు పోగొట్టుకునేకన్నా, క్షమాపణ కోరి ఆతనిని తన కుమారునిగా తివారీ అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రజలు హర్షిస్తారు అని మేథావి వర్గం భావిస్తుంది.

బ్రాహ్మణీ కేటాయింపుల్ని వెనక్కి తీసుకోవాలి


గాలి జనార్థన్ రెడ్డికి, 2007 మే 21 , నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకూ ఎటువంటి ఉత్పత్తి కాదుగదా, కర్మాగార నిర్మాణం కూడా జరగలేదు. కనుక అనేక వసతులు,రాయితీలతో పాటు ప్రధానంగా గాలికి కట్టబెట్టిన 14 ,549 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవడమే కాదు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించ నందుకు జరిమానాని కూడా విధించి వసూలు చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

గిరిజనులపై వై.కిషోర్ చంద్రదేవ్ కి ఎంత ప్రేమో!!!!!!!!!!!!


వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణాంతరం రాష్ట్ర నాయకులే కాదు, కేంద్ర స్థాయి నాయకులూ తమ నాలుకలను ఎటుకావాలంటే అటు తిప్పి మాట్లాడుతున్నారు. ఆంధ్రదేశంలో ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి క్యాబినెట్ బాక్సైట్ త్రవ్వకాలగూర్చి తీసుకున్న నిర్ణయాలను గూర్చి సదరు కేంద్ర మంత్రి చంద్రదేవ్ గారు అనేకసార్లు స్వయంగా  వై.ఎస్. .తోనే భేదించినట్లు "దొంగలుబడ్డ ఆరు నెలలకు "అనే సామెతలాగా వై.ఎస్.చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత...ఉపఎన్నికల సమయంలో పేపర్లనిండా తన బూటకపు ఆవేదనను వ్యక్త చేస్తున్నారు. వై.ఎస్.నిర్ణయాలను ఆ సమయంలో ఒక్కసారి విభేదించినట్లు నిరూపించాగాలడా అని సవాలు విసురుతున్నారు కొందరు. డిల్లీలో  ఉండి  తన రాజకీయ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇప్పటివరకు చూసుకుంటున్న మంత్రిగారు ఇప్పటివరకూ తన జాతిజనుల సంక్షేమం కోసం తానూ చేసింది ఏమీ లేదని గిరిజనులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గిరిజనుల అభివృద్ధికి మంత్రిగారు పాటుపడాలని మేథావులు సూచిస్తున్నారు.

Sunday, May 13, 2012

సి.బి.ఐ.ని ఎత్తి వేసెయ్యండి

ప్రజా స్వామ్య వ్యవస్థలో  ఒక వ్యక్తిమీద గాని, సంస్థ మీదగాని మోపబడిన నిందను, అభియోగాన్ని, జరిగిన నేరాలు - ఘోరాలపై  నిష్పాక్షిక విచారణను జరిపించి వాస్తవిక విషయాలను రాబట్టేందుకు ఏర్పాటు గావింపబడిన శాఖే సి.బి.ఐ.  సి.బి.ఐ. ని ప్రభుత్వాలు వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించు కుంటున్నాయి అని ఇప్పటివరకూ నిరూపించిన సంఘటనలు అనేకం. అది ఏ పార్టీ ఐనా గాని. పాలక పక్షం ప్రతిపక్షాలను,ఇతర పార్టీలను నోరు మూయించేందుకు, తమ దారికి రానివారిని,మాట వినని వారిని దారికి తెచ్చుకునేందుకు సి.బి.ఐ ని అధికార పక్షాలు ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటివరకు సి.బి.ఐ.ద్వారా (అవినీతి పరులను శిక్షించి) ప్రజాస్వామ్యానికి న్యాయం చేసినదానికంటే  ప్రభుత్వా లకు అనుకూలంగా వ్యవహరించి అధికార పక్షం వారికి సేవచేసిందే ఎక్కువ. ఇలా సి.బి.ఐ.ని "Congress Bureau of Investigation" అన్నట్లు అనేక మార్లు దుర్వినియోగ పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పుకోవచ్చు. సి.బి.ఐ. ఎవరి ప్రమేయం లేకుండా తనపని తానూ చేసుకు పోతుంది అనిపించే సంఘటనలు వేళ్ళపై లెక్కించ వచ్చు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే భవిష్యత్తులో  వారి భవిష్యత్తు బాగుంటుందనే స్వార్ధంతో కొందరు అతిగా వ్యవహరించడం కూడా చూస్తున్నాము. ఇప్పటివరకు జరిగిన అనేక స్కాంలు వెలుగులోకి వచ్చినా, ఫలాని నాయకుడు అవినీతిపరుడు , విచారించండి అని ఫిర్యాదు చేసింది ఒకరిపై ఒకరికి గిట్టని నాయకులేగాని ప్రజలుకాదు, మేధావి వర్గం కాదు. ప్రాథమిక సాక్ష్యాలతో సామాన్యులు సైతం ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి విచారించిన నాడే ప్రజలకు సి.బి.ఐ. పై మంచి అభిప్రాయం కలుగుతుంది. అలాకాకుండా ఈవిధంగా ప్రభుత్వాలకోసమే మేము పనిచేయ్యాలన్నట్లు వ్యవహరిస్తున్న సి.బి.ఐ.ని ఎత్తివెయ్యడం మంచిదనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం జేస్తున్నారు.   


మనిషిపోయాక ఏమైనా మాట్లాడతారు!



మనిషిపోయాక ఏమైనా మాట్లాడతారు అనే మానవ సహజ లక్షణాన్నినిస్సిగ్గుగా మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ బహిరంగ సభలో వ్యక్తం చేశారు. "వై.ఎస్.నాకు రాజకీయ జీవితం ఇవ్వలేదు" అంటున్నారు. 2004 - 2009 మధ్య కాలంలో ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇచ్చింది వై.ఎస్.కాదు కాబోలు.  2009 తర్వాత కిరణ్ కుమార్ ని స్పీకర్ ని  చేసింది వై.ఎస్.కాదు కాబోలు. కిరణ్ కుమార్ తన  స్థల్లన్ని ఆక్రమించుకున్నాడని ఒక బాధితుడు రెండు పర్యాయాలు అసెంబ్లీ ఆవరణలో చెట్టెక్కి ఉరిపోసుకుంటా నని మీడియాముందు గొడవ చేస్తే రక్షించింది వై.ఎస్.కాదు కాబోలు!.  పదవిని కాపాడుకోవడానికి...ఓట్లు రాబట్టుకోడానికి జనాలు వెర్రోళ్ళు అన్నట్లు, ఏం మాట్లాడినా  వింటారు, నమ్ముతారు అని కిరణే కాదు ఏ నాయకుడు అనుకోవద్దు. అధికారం కోసం నాయకులు విలువలు లేకుండా ఇంతగా దిగజారి పోతారా అని ఆశర్యపోతున్నారు జనం.

Thursday, May 10, 2012

వినియోగదారుల జేబులకు చిల్లి పెడుతున్న లలతా పెట్రోలియమ్స్.



అనకాపల్లి బ్రాంచ్ ఎల్.ఐ.సి.బిల్డింగ్ ప్రక్కనున్న  లలతా పెట్రోలియమ్స్ బంక్ యాజమాన్యం మరియు వెహికిల్స్ కు పెట్రోల్ నింపే బోయ్స్ కుమ్మక్కై వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఫీడింగ్ పంప్ ఉండంగా కూడా జెట్ పంప్ తోనే పెట్రోల్ కొడుతున్నారు. కారణం వినియోగదారులకు చిల్లర ఇవ్వాల్సిన పని ఉండదు. లీటర్ల లెక్కన పెట్రోల్ కొట్టించుకోవాలంటే తగిన చిల్లర ఉండదు గనుక ఇప్పుడందరూ రూపాయల లెక్కనే పెట్రోల్ కొట్టించు కుంటున్నారు. ఉదాహరణకి: వందరూపాయలకు జెట్ పంప్ ద్వారా పెట్రోల్ కొట్టించుకోవాలంటే వెహికిల్ ట్యాంక్ లో పడే పెట్రోల్ రూ.99 .75  పైసలది మాత్రమే. అదే ఫీడింగ్ పంప్ ద్వారా పెట్రోల్ కొట్టిస్తే వందరూపాయలకూ పడుతుంది ఆ పంప్ లో ఎలాంటి మతలబు, మోసమూ లేకుండా ఉంటే!. రోజురోజుకు పెట్రోల్ రెట్లు పెంచే గవర్నమెంట్ ఒకవైపు...కల్తీని అడ్డుకోకుండా లంచాలకుమరిగి పెట్రోల్ బంకువారికి సహకరిస్తున్న అధికారులు మరొకవైపు. వినియోగాదారులుకు అక్రమాలను నిలదీసే అధికారం ఉంది.కొరవడింది చైతన్యమే.