గిరిజనులపై వై.కిషోర్ చంద్రదేవ్ కి ఎంత ప్రేమో!!!!!!!!!!!!
వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణాంతరం రాష్ట్ర నాయకులే కాదు, కేంద్ర స్థాయి నాయకులూ తమ నాలుకలను ఎటుకావాలంటే అటు తిప్పి మాట్లాడుతున్నారు. ఆంధ్రదేశంలో ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి క్యాబినెట్ బాక్సైట్ త్రవ్వకాలగూర్చి తీసుకున్న నిర్ణయాలను గూర్చి సదరు కేంద్ర మంత్రి చంద్రదేవ్ గారు అనేకసార్లు స్వయంగా వై.ఎస్..తోనే భేదించినట్లు "దొంగలుబడ్డ ఆరు నెలలకు "అనే సామెతలాగా వై.ఎస్.చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత...ఉపఎన్నికల సమయంలో పేపర్లనిండా తన బూటకపు ఆవేదనను వ్యక్త చేస్తున్నారు. వై.ఎస్.నిర్ణయాలను ఆ సమయంలో ఒక్కసారి విభేదించినట్లు నిరూపించాగాలడా అని సవాలు విసురుతున్నారు కొందరు. డిల్లీలో ఉండి తన రాజకీయ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇప్పటివరకు చూసుకుంటున్న మంత్రిగారు ఇప్పటివరకూ తన జాతిజనుల సంక్షేమం కోసం తానూ చేసింది ఏమీ లేదని గిరిజనులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గిరిజనుల అభివృద్ధికి మంత్రిగారు పాటుపడాలని మేథావులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment