Friday, May 18, 2012

ముఖ్య మంత్రి అధికార దుర్వినియోగం


ఉప ఎన్నికల వేళ పాలక పక్షం వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తెలివిగా మంత్రులను ఉపఎన్నికలు జరిగే నియోజక వర్గాలకు ఇంచార్జ్లుగా నియమించడంతో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు సదరు మంత్రిగారిదగ్గరకి క్యూ కడుతున్నారు.ఇది ఇలా ఉంటే స్వయంగా ముఖ్య మంత్రే ఎన్నికల ప్రచారం చెయ్యడం జరుగుతుంది. ఈ పని అతని పార్టీకి సంబంధించినదే అయినప్పటికీ ఈ సందర్భంగా 
  • ముఖ్య మంత్రి వినియోగించే వాహనాలు ఏమిటి?
  • ముఖ్య మంత్రి విడిది చేసే బంగ్లాలు,వసతుల మాటేమిటి?
  • ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా వినియోగించే కాన్వాయ్ మాటేమిటి?
ఇవన్నీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే పనులే. మే 19 , 2012 న నెల్లూరు జిల్లా ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా జన సమీకరణ లో భాగంగా మంత్రుల ఆదేశంతో అధికారులు ఉపాది హామీ పథకం క్రింద పనిచేసే వారిని ఈ సభలకు తరలించారు. ప్రజా ధనాన్ని ఇలా పార్టీపరంగా ఉపయోగించుకున్నారు. ముఖ్య మంత్రి ఒక పార్టీకి చెందిన నాయకుడే కావచ్చు. ముఖ్య మంత్రి ఎవరు?ఎ పార్టీకి చెందినా వారు అనే భేదం లేకుండా ఉప ఎన్నికల వేళ   ముఖ్య మంత్రిగా ఉన్నవారు ప్రచారానికి వెళ్ళడానికి వీలులేదు అనే చట్టాన్ని తీసుకు రావాల్సి ఉంది. చిన్న చిన్న విషయాలకు కోడ్ ఉల్లంఘన అని గోల చేసే "ఎన్నికల సంఘానికి, అధికారులకు" జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగం, నాయకుల  స్వప్రయోజనాలకోసం ఖర్చై పోతున్న ప్రజా ధనం గూర్చి ఆలోచనే లేదు. ఈ విషయానికి సంబంధించి మేథావులు ఆలోచించాలి. ప్రజా ధనాన్ని పరిరక్షించాలి. 

No comments:

Post a Comment