Wednesday, May 23, 2012

కాంగ్రెస్ కు కాలం చెల్లనుంది


కేంద్ర ప్రభుత్వ పనితీరు చూస్తే కేంద్రప్రభుత్వానికి కాలం చెల్లనుందని అర్థమౌతుంది. గడిచిన మూడు సంవత్సరాలలో ప్రజలకు వారు ఏమి సేవచేశారానో ఆ సంబరాలు. దినదిన గండంగా ప్రభుత్వాన్ని ఈ మూడేళ్ళు నెట్టు కొచ్చినందుకే  ఈ సంబరం అన్నట్లు దేశరాజధానిలో సంబరం చేసుకున్నారు. వెనువెంటనే పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచారు. కుంభ కోణాల యు.పి.ఏ.ప్రభుత్వం పెట్రోల్ కంపెనీలనుంచి ఎంత ముడుపులు అందుకొని ఉన్న పళంగా పెట్రోల్ ధరలు పెంచారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా ఓడిపోతుందని తెలిసే మిగిలిన రెండు సంవత్సరాలలో ఇష్టా రాజ్యంగా దేశాన్ని దోచుకోడానికి వెనుకాడడం లేదు. ప్రజలకు భయపడడం లేదు. అదేమంటే  కాంగ్రెస్ జాతీయ పార్టీ. 130  సంవత్సాల పై చరిత్రగల పార్టీ  అని గొప్పలు చెప్పు కుంటున్నారు. ప్రతి ఊరిలో పుట్టకూ గుట్టకూ కూడా ఏళ్ల చరిత్ర వుంటుంది. నియంతలకూ,మహనీయులకు చరిత్ర ఉంటుంది. అందుకే ఇందిరా గాంధీ కాలంనాటి ఎమర్జెంసీ రోజులను తలపింపజేస్తూ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా కేంద్రంలో  యు.పి.ఏ.ప్రభుత్వం , ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. సోనియా కుటుంబం, కుటుంబమే పిల్లా పాపలతో వెళ్లి ఉత్తర ప్రదేశ్ లో ప్రచారం చేస్తే ప్రజలు తిరస్కరించినా సిగ్గు రాలేదు. భోఫోర్సు కుంభకోణం తెరమీదకి రాకుండా ఉండాలంటే  సోనియాగాంధీ రాజకీయంలో ఉండకతప్పదన్నట్లే వ్యవహరిస్తుంది. అసలు కాంగ్రెస్ నాయకుల ఆస్తులు ఎవరెవరివి ఎంతెంత స్విస్ బ్యాంక్ లో మూలుగుతున్నాయో ఊహకి అందడం లేదు. స్విస్ బ్యాంక్ లోని నల్ల ధనాన్ని భారత్ కి రప్పించడం అలా ఉంచండి, ఆ ధనాన్ని దేశ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టడం అలా ఉంచండి. కనీసం....భారతీయుల స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్లు కూడా  యు.పి.ఏ.ప్రభుత్వం ప్రకటించలేక పోయిందంటే కాంగ్రెస్ నాయకుల ఖాతాలు ఎందరివి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment