Thursday, May 10, 2012

విఫలమౌతున్న పోలీసులు

రోజురోజుకు బంగారం విలువ పెరిగిపోతూ ఉండడంతో అదేస్థాయిలో,అదే వేగంతో చైన్ స్నాచింగ్ కేసులూ పెరుగుతున్నాయి.  ఇటువంటి సంఘటనలను నివారించడంలో అనకాపల్లి పోలీసులు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ   అంతిమంగా సంఘటనలు పునరావృతం కాకుండా చెయ్యడంలో విఫలమౌతున్నారని చెప్పక తప్పదు. అడపా దడపా  చైన్ స్నాచెర్స్ పట్టుబడగా వారినుంచి రికవరీ చేసిన బంగారాన్నిసంబందితులకు అప్పజెప్పడంలోకూడా పారదర్శకతలేదని భాదితులు అనుమానాలు వ్యక్తం జేస్తున్నారు. ఏది ఏమైనా  ఇటువంటి సంఘటనలు తగ్గుముఖంపట్టేలా పోలీసులు మరింత కృషి చెయ్యాలని ప్రజలు భావిస్తున్నారు. 

No comments:

Post a Comment