Thursday, May 17, 2012

అప్రజాస్వామికంగా ప్రభుత్వం...



వై.ఎస్.మంత్రి మండలి 

జగన్ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యకు దిగినట్లు సామాన్యులకు సైతం స్పష్టమౌతుంది. గత ఉప ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ వారికి ఇంకా సిగ్గు రాలేదని గ్రహించాలి.. మరలా ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేని రాష్ట్ర కాంగ్రెస్ కేంద్రం సహకారంతో, సి.బి.ఐ.ని తన ఆయుధంగా మలుచుకొని వ్యక్తిగతంగా జగన్ పైకి దాడికి దిగింది. ఇప్పటివరకు అభియోగం మోపబడిన వారినెందరినో సి.బి.ఐ. విచారించింది వేరు వేరు కేసుల్లో. విచారణ జరుగుతున్న దశలో ఏవొక్క కేసులోనూ విచారింప బడుతున్న వారి ఆస్తులను అటాచ్ మెంట్ కోరుతూ సి.బి.ఐ. ప్రభుత్వాన్ని అడిగిన సందర్భాలు పెద్దగ లేవు. సి.బి.ఐ.అడిగిందే తడవుగా అన్నింటిలోను నత్తనడకను ప్రదర్శించే ప్రభుత్వం వెను వెంటనే వారి అభ్యర్థనను ఆమోదించిన సందర్భాలూ లేవు. ఈ పరిణామాలన్నీ కక్ష సాధింపు చర్యలని రుజువు చేస్తున్నాయి.

సి.బి.ఐ. విచారణ లోనే ఎన్నో లోపాలు:
సి.బి.ఐ.వారు చిత్త శుద్ధితో కేసు విచారణ చెయ్యడం లేదు. కారణం అత్యున్నత కోర్టు స్థాయిల్లో వారి వాదన ఓడిపోతుంది. వారికి తెలిసినా ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశం గనుక!

ఇలా విచారించాలిగాదా!:
  • వ్యక్తిగతంగా కొందరికి లబ్ది చేకూర్చినందుకే వారు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని; అలా జగన్ కోట్లాది రూపాయలు కూడబెట్ట డన్నదే ప్రధాన అభియోగం. అప్పటి ముఖ్య మంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంత్రివర్గ ఆమోద ముద్రతోనే ఇవి చేసినప్పుడు మంత్రి వర్గంలోని మిగతా మంత్రులను సి.బి.ఐ. విచారించక పోవడాన్ని ఏమనాలి?
  • కొందరికి వ్యక్తిగత ప్రయోజనాన్ని కలిగించినందుకు ముట్టిన ప్రతిఫలాన్ని ఒక్క వై.ఎస్.మాత్రమే పొందగా మిగతా మంత్రులు ఎటువంటి ప్రయోజనాలు పొందకుండా అందులో వాటాలేకుండా ఉండే అంత అమాయక చక్రవర్తులా? నోరులేనివారా? నిస్వార రాజకీయ నాయకులా?
  • జగన్ స్థాయిలో మంత్రివర్గం లోనివారికి కంపెనీలు లేకపోవచ్చు. వై.ఎస్. వాళ్ళ లబ్ది పొందినవారు ఇలాంటి మంత్రులకు వారికివ్వాల్సిన వాటాను పెట్టుబడులుగా కాకపోయినా ధనరూపంలో నైన ఇచ్చి ఉండాలిగా? అది తెలుసు కోడానికి మంత్రి వర్గంలోని అందరి ఆస్తులపై సి.బి.ఐ.దర్యాప్తు చెయ్యాలిగా? అలా చెయ్యడం లేదు ఎందుకు?
  • మంత్రివర్గం జారీచేసిన జీ.ఓ.లను అమలుచేసిన అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్నప్పుడు, ఆ జీ.వో.లకు సూత్రధారులైన అప్పటి మంత్రి వర్గం లోని వారిని జగన్ ని విచారిస్తున్న పద్దతిలోనే సి.బి.ఐ.వారు అప్పటి మంత్రులను ఎందుకు విచారించడం లేదు?
ప్రతిపక్షాలు, మేథావి వర్గాలు ఏం చేస్తున్నారు:


న్యాయానికి విరుద్ధంగా ఒకరికి ఒక పద్ధతి, మరికొందరికి మరో పద్ధతి అన్నట్లు వ్యవహరిస్తున్న సి.బి.ఐ.ని ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదు. ఏ ఒక్క పార్టీ  విమర్శలు గుప్పించడం లేదు. అప్పటి మంత్రి వర్గం వారందరిపై ఇటువంటి విచారణనే చేపట్టామని గట్టిగా అడగక పోవడానికి కారణం అన్ని పార్టీల ఉమ్మడి శత్రువు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ, దాని నాయకుడు జగన్. మీడియాలో మాట్లాడుతున్న నాయకుల మాటల్ని గమనిస్తుంటే రాష్టంలో జగన్ తప్పించి అందరూ పవిత్రులు, దోపిడీ అంటేనే తెలియదన్నట్లు మాట్లాడు తున్నారు. నిజం రుజువు చేసుకోడానికి ఏ ఒక్కరు సి.బి.ఐ.ని ఆహ్వానించరు కదా...ఎవరైనా ఫలానా మంత్రిని విచారణ జరపమని అంటే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటారు. బొత్సా లాంటి వారి బండారం బయటపడుతున్న దశలో కీలకమైన, ఖచ్చితమైన సిన్సియర్ ఆఫీసర్లు ప్రమోషన్ల పేరుతో మాయమై పోతారు. రాజకీయ నాయకులు సరే...మేథావి వర్గం ఏమి చేస్తున్నారు? ఎందుకు మౌనం?

No comments:

Post a Comment