రాష్ట్రంలో సి.బి.ఐ.జరుగుతున్న అవినీతి విచారణ తంతు రోజుకొక మలుపు తిరుగుతుంది. తాజాగా రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి మోపి దేవి వెంకట రమణా రావు అరెస్ట్ ఉదంతం తో మంత్రులు అయోమయంలో పడి ఏమి మాట్లాడుతున్నామో అనేది కూడా ఆలోచించకుండా బరితెగించి మాట్లాడుతున్నారు. నిన్న మోపి దేవి వెంకట రమణా రావు , రేపు నేను (మేము) నేను అరెస్ట్ కావచ్చు అనే ధోరణితో రాష్ట్ర మంత్రులు "మోపిదేవికి అండగా ఉంటాం"అని అని బహిరంగంగా రాష్ట్ర మంత్రివర్గం అనడంటే ప్రజలంటే, ప్రజాస్వామ్యమంటే భయం లేని వారి తత్వాన్ని గ్రహించ వచ్చు. ప్రతిపక్షాలు, వ్యతిరేకులను అరెస్ట్ చేస్తే "విచారణ కదా! తప్పు చెయ్యనప్పుడు భయమెందుకు?" అని దీర్ఘాలు తీసి మాట్లాడే ఈ అవినీతి మంత్రులకు, దోపిడీ నాయకులకు ఎందుకింత భయం. తర్వాత వంతు మీదనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్న నాయకులను (పాలకపక్షం వారిని తప్పించి) ఎవరినైనా విచారించ వచ్చు. చట్టం తమ పని తాము చేసుకు పోతున్నారని శాంతి సంరక్షకుల్లా, నీతి కోవిదులులా మాట్లాడే నాయకులకు ఇప్పుడు ...చ్చ పడుతుందా? ఐ.ఏ.ఎస్. లు, నాయకులు ఎంత అవినీతి చేసినా విచారించ కూడదు. నాయకుల వైఖరికి నిరసనగా ప్రజలు ఏకమై నాయకుల అవినీతిపై గళ మెత్తాలి. అవినీతి మంత్రులకు మిగతా మంత్రులే కాదు,ప్రతిపక్షం వారు కూడా అండగా నిలిచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. నాయకుల జీత భత్యాల పెంపు, పెన్షన్ మొదలగు ఉమ్మడి ప్రయోజనాల విషయంలో వివిధ పార్టీల, నాయకుల వాదోప వాదనలు, వాక్ అవుట్ లు లేకుండా స్వల్ప వ్యవధిలోనే బిల్లు లు పాస్ అవుతాయి. ఎందుచేతనంటే వారందరి ప్రయోజనం. జనం సోమ్మేగా! అనే భావన.
నోట్లో వేలు పెడితే కొరక లేని అమాయక చక్రవర్తులు మన రాష్ట్ర మంత్రులు."మాకేమైనా మేలు జరిగిందా?", "కేవలం సంతకాలు చేసినందుకే ఇంత తీవ్ర చర్యలా?" .ఇవి సదరు మంత్రులు పాపం పసిపిల్లల్లా మాట్లాడే మాటలు. "అవినీతి చెయ్యనప్పుడు మీకు భయమెందుకు?" "అవినీతి చెయ్యనప్పుడు మీ ఆస్తులపై సి.బి.ఐ.ని విచారణ చేపట్టమనండి. ఆర్థికంగా మేము లబ్ది పొందలేదని నిరూపించు కొండి!" అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు వణికి పోయే నాయకులను.మంత్రి వర్గం లోని
ప్రతి ఒక్కరి ఆర్ధిక వ్యవహారాలపై సి.బి.ఐ. కూలంకషంగా విచారణ చెయ్య వలసిందిగా అనకాపల్లి న్యూస్ .కామ్ పజల పక్షాన డిమాండ్ చేస్తుంది.
No comments:
Post a Comment