కాంగ్రెస్ హై కమాండ్ పంపగా మన రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్ గిరి వెలగబెట్టేందుకువచ్చి ఘనకార్యం చేసి ఘనుడు తివారీ . అతగానికి ఇలాంటి ఘన చరిత్రలు దేశంమొత్తం మీదా చాలానే ఉన్నాయని లోక విదితం. పెద్దోళ్ళ కొక న్యాయం, పేదోళ్ళ కొక న్యాయమన్నట్లు న్యాయస్థానాలు వ్యవహరిస్తున్నాయి. తివారినే తన తండ్రి. కావాలంటే డి.ఎన్.ఏ. పరీక్ష చేసి నాకు న్యాయం చెయ్యండి అని రోహిత్ శర్మ మూడు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నాపోలీస్ శాఖా, న్యాయ శాఖలు మౌనంగా ఉండిపోయాయి. ఇన్నాళ్ళకి కాస్త కోర్టు కళ్లెర్రజేస్తూ రక్త పరీక్షకు నిరాకరించే తివారిని హెచ్చరించింది. నేటి రాజకీయ నాయకులకు పదవులు రక్షణ కవచంలా ఉపయోగపడడం , ఆ అండతో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలనీ సాగించడం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి తివారీలు నేటి రాజకీయ రంగంలో తక్కుమందేమి లేరు. డిల్లీ హైకోర్ట్ ఇచ్చిన రెండురోజుల గడువులోపు రక్త పరీక్ష ఇచ్చి నేరం రుజువు కాబడి పరువు పోగొట్టుకునేకన్నా, క్షమాపణ కోరి ఆతనిని తన కుమారునిగా తివారీ అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రజలు హర్షిస్తారు అని మేథావి వర్గం భావిస్తుంది.
No comments:
Post a Comment