మనిషిపోయాక ఏమైనా మాట్లాడతారు అనే మానవ సహజ లక్షణాన్నినిస్సిగ్గుగా మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ బహిరంగ సభలో వ్యక్తం చేశారు. "వై.ఎస్.నాకు రాజకీయ జీవితం ఇవ్వలేదు" అంటున్నారు. 2004 - 2009 మధ్య కాలంలో ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇచ్చింది వై.ఎస్.కాదు కాబోలు. 2009 తర్వాత కిరణ్ కుమార్ ని స్పీకర్ ని చేసింది వై.ఎస్.కాదు కాబోలు. కిరణ్ కుమార్ తన స్థల్లన్ని ఆక్రమించుకున్నాడని ఒక బాధితుడు రెండు పర్యాయాలు అసెంబ్లీ ఆవరణలో చెట్టెక్కి ఉరిపోసుకుంటా నని మీడియాముందు గొడవ చేస్తే రక్షించింది వై.ఎస్.కాదు కాబోలు!. పదవిని కాపాడుకోవడానికి...ఓట్లు రాబట్టుకోడానికి జనాలు వెర్రోళ్ళు అన్నట్లు, ఏం మాట్లాడినా వింటారు, నమ్ముతారు అని కిరణే కాదు ఏ నాయకుడు అనుకోవద్దు. అధికారం కోసం నాయకులు విలువలు లేకుండా ఇంతగా దిగజారి పోతారా అని ఆశర్యపోతున్నారు జనం.
No comments:
Post a Comment