ప్రజా స్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తిమీద గాని, సంస్థ మీదగాని మోపబడిన నిందను, అభియోగాన్ని, జరిగిన నేరాలు - ఘోరాలపై నిష్పాక్షిక విచారణను జరిపించి వాస్తవిక విషయాలను రాబట్టేందుకు ఏర్పాటు గావింపబడిన శాఖే సి.బి.ఐ. సి.బి.ఐ. ని ప్రభుత్వాలు వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించు కుంటున్నాయి అని ఇప్పటివరకూ నిరూపించిన సంఘటనలు అనేకం. అది ఏ పార్టీ ఐనా గాని. పాలక పక్షం ప్రతిపక్షాలను,ఇతర పార్టీలను నోరు మూయించేందుకు, తమ దారికి రానివారిని,మాట వినని వారిని దారికి తెచ్చుకునేందుకు సి.బి.ఐ ని అధికార పక్షాలు ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటివరకు సి.బి.ఐ.ద్వారా (అవినీతి పరులను శిక్షించి) ప్రజాస్వామ్యానికి న్యాయం చేసినదానికంటే ప్రభుత్వా లకు అనుకూలంగా వ్యవహరించి అధికార పక్షం వారికి సేవచేసిందే ఎక్కువ. ఇలా సి.బి.ఐ.ని "Congress Bureau of Investigation" అన్నట్లు అనేక మార్లు దుర్వినియోగ పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పుకోవచ్చు. సి.బి.ఐ. ఎవరి ప్రమేయం లేకుండా తనపని తానూ చేసుకు పోతుంది అనిపించే సంఘటనలు వేళ్ళపై లెక్కించ వచ్చు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే భవిష్యత్తులో వారి భవిష్యత్తు బాగుంటుందనే స్వార్ధంతో కొందరు అతిగా వ్యవహరించడం కూడా చూస్తున్నాము. ఇప్పటివరకు జరిగిన అనేక స్కాంలు వెలుగులోకి వచ్చినా, ఫలాని నాయకుడు అవినీతిపరుడు , విచారించండి అని ఫిర్యాదు చేసింది ఒకరిపై ఒకరికి గిట్టని నాయకులేగాని ప్రజలుకాదు, మేధావి వర్గం కాదు. ప్రాథమిక సాక్ష్యాలతో సామాన్యులు సైతం ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి విచారించిన నాడే ప్రజలకు సి.బి.ఐ. పై మంచి అభిప్రాయం కలుగుతుంది. అలాకాకుండా ఈవిధంగా ప్రభుత్వాలకోసమే మేము పనిచేయ్యాలన్నట్లు వ్యవహరిస్తున్న సి.బి.ఐ.ని ఎత్తివెయ్యడం మంచిదనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం జేస్తున్నారు.
No comments:
Post a Comment