Tuesday, June 5, 2012

ప్రభుత్వాలూ ...ప్రజలు గమనిస్తున్నారు!!


కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపితంగా అనుసరిస్తున్న ద్వంద వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్న నాయకులను కేంద్రం పార్టీలను బట్టి , కొందరితో కేంద్రప్రభుత్వానికున్న అభిప్రాయ బేధాల్ని బట్టి సి.బి.ఐ.ద్వారా విచారణ చేయిస్తుంది, ఐ.టి.దాడులు చేయిస్తుంది. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే  ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంత అవినీతికి పాల్పడ్డా ప్రభుత్వం రక్షిస్తుంది అని నాయకులకు ధీమాను కలుగ జేస్తుంది కేంద్ర ప్రభుత్వం. లిక్కర్ సిండికేట్ వ్యవహారం లోనూ, ఓక్స్ వ్యాగన్ వ్యవహారాలలో ఆరోపణలు ఎదుర్కుంటున్న బొత్స సత్యనారాయణ సి.బి.ఐ.గూర్చి భయంలేక పోగా తన వ్యవహారంలో దూకుడుగా ప్రదర్శిస్తున్న పోలీస్ ఆఫీసర్నే మార్పించాడు ప్రభుత్వం అండతో. వై.ఎస్.ఆర్. ఆత్మగా చెప్పుకునే కే.వి .పి. రామచంద్ర రావు కాంగ్రెస్ తరఫున ప్రచారంలో మునిగిపోయారు గాని సి.బి.ఐ.కి సంబంధించిన భయం లేదు. కంటితుడుపుగా మంత్రి మోపిదేవిని పట్టించుకో పోయినా చాలామంది మంత్రులను కేంద్రం కాపాడుకుంటూ వస్తుంది. జైలు పాలైనందుకు మోపినేనికి బహిరంగంగానే సహచర ప్రజాప్రతినిధులు  సానుభూతిని ప్రకటిస్తున్నారు. పార్టీలు సారా పోయించినా, డబ్బులు పంచినా ఎ రూపంలో ప్రలోభ పెట్టిన ఓటరు ఓటింగు రోజున ఇటువంటి ద్వంద వైఖరిని ప్రదర్శించే పార్టీలకు బుద్ధి చేబుతారనేది నగ్న సత్యం.  

No comments:

Post a Comment