సామాజిక న్యాయం కోసమే పార్టీ అంటూ "ప్రజారాజ్యం" పార్టీని స్థాపించి కలలోకూడా ఉహించని రీతిలో పరాభవం చెందిన మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం సిగ్గులేకుండా కాంగ్రెస్ లో ఇమిడి పోయారు. " కాంగ్రెస్ వారిని పంచలూడదీసి తరిమి కొట్టండి" అని పిలుపునిచ్చిన యువరాజ్యం నేత, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ విలీనం అనంతరం "సిగ్గుతో" అన్న రాజకీయ వ్యవహారాలకు దూరమయ్యాడు. చిన్నవాడికున్న సిగ్గు చిరంజీవికి లేక పోయిందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. అవినీతి పార్టీ అని ప్రజలకు చాటిచెప్పిన చిరంజీవి తిట్టిన పార్టీలోనే విలీనం చేశారు తన పార్టీని. పార్టీ లోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులైన గంటా శ్రీనివాసరావు కి, సి.రామచంద్రయ్య కు మంత్రి పదవులు, తనకి రాజ్యసభ పదవీ తెప్పించుకొని నిజంగా సామాజిక న్యాయం చేసుకున్నాడు. చిరంజీవి అమాయకుడు, రాజకీయం తెలియదు అనుకున్న జనానికే మతిపోయేలా "తెలుగుదేశం అవినీతికి కిటికీ తెరిస్తే, కాంగ్రెస్ తలుపులే తెరిసింది " లక్షలాది ప్రజలమధ్యలో కాంగ్రెస్ ను విమర్శించిన చిరంజీవి అదే పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. అవినీతి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోవడం కాకుండా కాంగ్రెస్ అవినీతి పార్టీ అని చెప్పిన అదే ప్రజలకు కాంగ్రెస్ కు ఓటు వెయ్యండి అని చిరంజీవి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకమారు ఓడినంత మాత్రాన ఐదేళ్ళు ఆగలేని నాయకుడు ప్రజలకేమి సేవచేస్తాడని ప్రజలే రాజకీయంలో రాటుదేలిన చిరంజీవి తీరును చూసి ఆశ్చర్య పోతున్నారు.
No comments:
Post a Comment