Saturday, July 7, 2012

బరితెగిస్తున్న కిరణ్ సర్కార్


     జగన్ అక్రమార్జన కేసులో సి.బి.ఐ. విచారణను ఎదుర్కుంటున్న మంత్రులపట్ల రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారనే ఆలోచనని కూడా లెక్క చెయ్యకుండా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపిస్తే కేబినేట్ ఆమోదం తీర్మానంతో ఏమైనా చేసుకోవచ్చనే లెక్కలో కిరణ్ ప్రభుత్వం ఉంది. మంత్రులు ప్రజాధనాన్ని బొక్కడం ఒక నేరమని అనుకుంటుంటే...అలాంటి నేర గాళ్లుగా అరూపణలు ఎదుర్కుంటున్న మంత్రులకు న్యాయ సహాయక ఖర్చులు  ఆయా మంత్రుల శాఖలే (ప్రజాధనంతో కూడిన ప్రభుత్వమే) భరిస్తుందనే నిర్ణయం తీసుకోవడం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు.
     విచారణను ఎదుర్కుంటున్న, ఎదుర్కోబోతున్నమంత్రుల నేరారోపణ రుజువైందే అనుకో...; వారికి న్యాయ సహాయం క్రింద ఖర్చుచేసిన డబ్బును మంత్రుల వద్ద నుండి వాపసు తీసుకుంటామని ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. న్యాయ నిపుణుల సలహా,సూచనల  మేరకే ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు కూడా ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. తన ముఖ్య మంత్రి కుర్చీని కాపాడడంలో మంత్రులు సహకరించినందుకు కృతజ్ఞతగా కిరణ్ కుమార్ రెడ్డి తన సొంతధనాన్ని సంబంధిత మంత్రులకు సహాయం చేసిఉంటే ప్రజలు హర్షించేవాళ్ళు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లు ప్రజాధనాన్ని నాయకులు పంచేసుకోవడమే కాకుండా, ఇలా ప్రజధనంతోనే ఈ కేసులవల్ల తమకు ఎలాంటి ఖర్చులేకుండా కేసులనుంచి బయటబడాలని నాయకులు భావించడం ప్రజలు హర్షించని విషయం. కోతికి కొబ్బారికాయ దొరికినట్లు వై.ఎస్. మరణం పుణ్యామా అని, ఆపై సోనియమ్మ పుణ్యామా అని ముఖ్య మంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఏమి చేస్తున్నాడో... ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా బహిరంగంగానే మాట్లాడుతున్నాడు. మేథావులు, ప్రజా సంఘాలు ప్రభుత్వ నిర్ణయంపై నిరసనను తెలియ జేయాలని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.

No comments:

Post a Comment