రాజకీయ పునరావాస కేంద్రంగా పేరొందినది విధానమండలి. రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసినవాటిలో మేథావులు-ప్రజలు వ్యతిరేకించింది, అన్నిరాజకీయ పార్టీలకు ఉమ్మడి ప్రయోజనాత్మక మైనది విధానమండలి. నెలకు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం తప్పించి ప్రజలకు విధానమండలి వల్ల ఇప్పటివరకు కలిగిన ప్రయోజనాన్ని ఒక్కటికూడా చూపలేము. రాజకీయనాయకుల పార్టీ పరమైన వ్యతిరేక దూషణ లుతప్ప రాష్ట్ర ప్రయోజనాలకు , వ్యవహారాలకు సంబంధించి ఒక్క అంశంమీద ప్రయోజనాత్మకమైన, సమగ్రమైన డిబేట్ జరగలేదు. ఒకప్రక్క ప్రభుత్వం డబ్బు లేదంటూ; పెన్షన్ విధానానికి మంగళం పాడి వారికి సంబంధించి మాత్రం చాలా అనుకూలంగా పదేపదే జీతాల పెంపు, ఇతర సౌకర్యాల విషయంలో అన్ని పార్టీలు సోదర భావంతో సామరస్యంగా సత్వరమే నిర్ణయాలు తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యడంలో రాజకీయ పార్టీలన్నీ ఒకటే అని నిరూపించాయి.నిరుపయోగమైన విదానమండలిని రద్దు చెయ్యాలని ప్రజలు,మేధావులు,రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించే వారు గట్టిగా డిమాండ్ చెయ్యాలి. సోషల్ నెట్ వర్క్స్ ద్వారా ప్రజలను మనందరం చైతన్య పరచాలని అనకాపల్లి న్యూస్ .కాం ఆశిస్తున్నాను.
Tuesday, June 19, 2012
Monday, June 11, 2012
చెత్త నాయకుల రొటీన్ డైలాగ్స్
చెత్త రాజకీయ నాయకులు చెత్త డైలాగ్ లను మాత్రం వదలరు. ఏళ్ళు తరబడినా ఇలాగే మాట్లాడు తుంటారు. ఇలా మాట్లాడడమే రాజకీయం అనుకుంటారు.
ఎన్నికల ప్రచారంలో:
- భారీ మెజారిటీతో మా అభ్యర్దిదే ఘనవిజయం.(అన్ని పార్టీలు)
ఉప ఎన్నికలైతే:
- ప్రతిపక్షాలు: ఈ ఎన్నికల తీర్పు రెఫరాండం గా భావించాలి.
- పాలక పక్షం: ఈ ఎన్నికల ఫలితాలు రెఫరాండం కానేకాదు.("చక్కగా పాలించాను" అని అనిపిస్తేగాదా ధైర్యంగా ఒప్పుకోడానికి!)
ఫలితాలు వెలువడాకా :
ఓడినోడు గెలిచినోళ్ళ నుద్దేశించి :
- డబ్బు మందు విచ్చలవిడిగా పంచి గెలిచారు.(ఇతగాడేమీ ఇటువంటివి ఎరగనట్లు నంగనాచి మాటలు..)
ఫలితాలపై పార్టీలు:
ఓడిన పార్టీలు:
- వారి స్థానాలు వాళ్ళు గెలిచారు. మేము ఓడింది ఏమీలేదు.(మరెందుకు ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టిందో!)
- మా పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది.(లేదా) మునుపటిలాగే ఉంది.(జంప్ జిలానీ అయిన నాయకుల్లా కాకుండా పార్టీని అంటిపెట్టుకున్న ప్రజలెందరో తెలుసుకోడానికా?)
పై విధంగా చేత్తమాటలు మాట్లాడకుండా ఉన్నవిషయాన్ని ఉన్నట్లు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. లేదంటే ఇలాగే వాతలు పెడతారు ఎన్నికలప్పుడు.
జగన్ ప్రత్యర్థులకు తీరని కోరిక
వై.కా.పా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో అన్ని పార్టీలు, అన్ని మీడియా లు ఒకటయ్యాయి. నిబంధనలను అతిక్రమిస్తూ అధికారులు ప్రభుత్వాధి నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. జడ్ కేటగిరి ఉన్న జగన్ ని నాలుగు రోజులపాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ లో ఎంతో బద్రతతో తీసుకువెళ్ళిన పోలీస్ అధికారులు పైఅదికారులు, నాయకుల ఆదేశాలను అనుసరించి చివరి రోజున మామూలు ఖైదీలను తీసుకు పోయే వ్యానులో కోర్టుకు హాజరు పరిచారు. అలా తీసుకు వెళ్ళడం జగన్ వ్యతిరేకులకు ఆనందాన్ని కలిగించింది. జగన్ పై వారి అక్కసు ఎలావుందంటే ...."అంకుశం"సినిమాలో బేడీలు వేసి నడిరోద్దుమీదనుంచి నడిపించుకొని తీసుకు వెళ్ళినట్లు నిజంగానే జగన్ ను అలా తీసుకువెళ్ళా లన్నట్లు ఆశపడుతున్నారు. జగన్ వ్యవహారంలో ప్రత్యర్థులకు తీరని కోరికగా పైన ప్రస్తావించిన విషయం ఉంది పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం బరి తెగించింది అన్న దానికి ఇటువంటి ఉదాహరణలు కొల్లలు. సి.బి.ఐ. ని కోర్ట్ మొట్టికాయలు వెయ్యడంతో మరల మునుపటిలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్ లో జగన్ ను కస్టడీకి తీసుకు పోయారు.
Tuesday, June 5, 2012
దళారులను ప్రోత్సహిస్తూ అనకాపల్లి డి.సి.ఎం.ఎస్. సిబ్బంది.
గ్రీన్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి దళారి.
కొనుగోలు దారులతో దళారి
పుస్తకాలు విక్రయిస్తున్న సిబ్బంది.
అనకాపల్లి డి.సి.ఎం.ఎస్. వారి ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విక్రయం ప్రారంభమైనది,. అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో క్యూలో పుస్తకాలకోసం నిలబడగా ఒకవ్యక్తి డి.సి.ఎం.ఎస్. సిబ్బంది సహకారంతో కౌంటర్ వద్ద నిలబడి మధ్యలో వచ్చిన వారివద్ద అదనపు డబ్బులు పుచ్చుకొని వారికి పుస్తకాలు ఇప్పించే తంతును గమనించిన అనకాపల్లి న్యూస్ .కాం "మీరెవరు" అని ప్రశ్నించగా నేను ఇక్కడి స్టాఫ్ అని చెప్పాడు. అనకాపల్లి న్యూస్ .కాం డి.సి.ఎం.ఎస్. సిబ్బంది ని వివరణ అడగగా అతను మా సిబ్బంది కాదు, సర్వీసు చేస్తున్నాడు అని చెప్పారు. దళారిలాగా వ్యవహరిస్తున్న అతనిని ప్రశ్నిస్తే స్టాఫ్ అని అతను చెప్పినప్పుడు "కాదు"అని మీరెందుకు ఖండించాలేదని డి.సి.ఎం.ఎస్. సిబ్బందిని అడగగా నీళ్ళునమిలారు. ఇక్కడ జరుగుతున్న నల్లబజారు వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపించమని అనకాపల్లి న్యూస్,కాం ఈ వ్యవహారంలో ప్రమేయమున్నవారిపై పోలీసు కేసు నమోదు చేయనున్నది.
అపర బిజినెస్ గాంధీ.
ఆ గాంధీకి "కోట్లు" లేవు. ఆ గాంధీకి మొలమీద తప్ప వంటిమీద బట్టలేదు. ఆ గాంధీకి పదవులపై ఆశ లేదు. ఈ అపర గాంధీ కి లేనిది లేదు. ఆయనెవరో కాదు, లగడపాటి. డబ్బుంటే చాలు, నాయకుడై పోవచ్చు. ప్రజాసేవ పేరుతో అందరిలా ఆయనకూడా అలా రాజకీయాల్లోకి వచ్చినవాడే! "సమైక్యాంధ్ర" పేరుతో ఇంకాస్త వెలుగు లోకి వచ్చాడు లగడపాటి. తనవల్లే రాష్ట్రం విడిపోకుండా ఉందని రాష్ట్ర ప్రజలకు బిల్డప్ ఇస్తున్నాడు. ఇది చాలదన్నట్లు చేతిలో జెండాను పట్టుకుని గాంధీ గారిలా పాద యాత్రలు చేస్తూ ప్రయాసపడుతున్నాడు, "నీవు మాకు ఏమిచేశావని ఓట్లు అడగడానికి వచ్చావని"అక్కడక్కడ ప్రజలచేత నిలదీయబడుతున్నాడు. కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ముఖ్యమంత్రి కాగా ఇంత చేసిన నాకేనా వీలుకానిది అనే భావనతో "ముఖ్య మంత్రి పీఠం" కోసం శ్రాయశక్తుల కృషి చేస్తున్నాడు. బహుశా బొత్సా ,చిరు సి.ఎం.పీఠం కోసం ప్రయ్తత్నిస్తుండగా నేనేమైనా తక్కువ తిన్నానా అని కాబోలు ఎన్నికల ప్రచారంలో రోజుకో కథ చెబుతున్నాడు, రోజుకో వేషం వేస్తున్నాడు. వై .ఎస్.మరణాంతరం సి.ఎం.పీఠం ఎంత చులకనైంది?!
వాన్ పిక్ బాధితులపై కాంగ్రెస్ ఓట్ల గాలం
ప్రకాశం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వాన్ పిక్ బాధితుల కు ఆశ చూపి ఓట్లుగా మలుచుకునే పనిలో బిజీగా ఉన్నారు. విచారణలో,వివాదంలో,కోర్ట్ పరిధిలో ఉన్న ఈ వ్యవహారాన్ని తను ముఖ్యమంత్రి దృష్టికి ,కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి పరష్కరిస్తానని బాధితులకు ఆశచూపుతున్నాడు.ప్రజలకు నామమాత్రంగా ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకొని ఎవరి భూములు వారికి ఇస్తారా ? అలాంటిది ఎమీలేకుండానే ఎవరి భూములు యధావిధిగా వారికే ఇస్తారా? ఎప్పటిలోపు ఇస్తారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం పి.ఎం.కూడా ఇవ్వలేడు. మరి మంత్రిగారు అరకపట్టి ఏరువాక అని వాన్ పిక్ ఏకరువు పెడుతున్నారెందుకంటే కేవలం ఓట్ల కోసమే ! ఎన్నికలయ్యాక మంత్రి గారిచ్చిన మాటపై కార్యరూపం దాల్చనప్పుడు భాదితులు నిలదీసే రోజువస్తుంది. ఇది సత్యం.
సామాజిక న్యాయం చేసుకున్న చిరంజీవి.
సామాజిక న్యాయం కోసమే పార్టీ అంటూ "ప్రజారాజ్యం" పార్టీని స్థాపించి కలలోకూడా ఉహించని రీతిలో పరాభవం చెందిన మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం సిగ్గులేకుండా కాంగ్రెస్ లో ఇమిడి పోయారు. " కాంగ్రెస్ వారిని పంచలూడదీసి తరిమి కొట్టండి" అని పిలుపునిచ్చిన యువరాజ్యం నేత, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ విలీనం అనంతరం "సిగ్గుతో" అన్న రాజకీయ వ్యవహారాలకు దూరమయ్యాడు. చిన్నవాడికున్న సిగ్గు చిరంజీవికి లేక పోయిందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. అవినీతి పార్టీ అని ప్రజలకు చాటిచెప్పిన చిరంజీవి తిట్టిన పార్టీలోనే విలీనం చేశారు తన పార్టీని. పార్టీ లోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులైన గంటా శ్రీనివాసరావు కి, సి.రామచంద్రయ్య కు మంత్రి పదవులు, తనకి రాజ్యసభ పదవీ తెప్పించుకొని నిజంగా సామాజిక న్యాయం చేసుకున్నాడు. చిరంజీవి అమాయకుడు, రాజకీయం తెలియదు అనుకున్న జనానికే మతిపోయేలా "తెలుగుదేశం అవినీతికి కిటికీ తెరిస్తే, కాంగ్రెస్ తలుపులే తెరిసింది " లక్షలాది ప్రజలమధ్యలో కాంగ్రెస్ ను విమర్శించిన చిరంజీవి అదే పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. అవినీతి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోవడం కాకుండా కాంగ్రెస్ అవినీతి పార్టీ అని చెప్పిన అదే ప్రజలకు కాంగ్రెస్ కు ఓటు వెయ్యండి అని చిరంజీవి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకమారు ఓడినంత మాత్రాన ఐదేళ్ళు ఆగలేని నాయకుడు ప్రజలకేమి సేవచేస్తాడని ప్రజలే రాజకీయంలో రాటుదేలిన చిరంజీవి తీరును చూసి ఆశ్చర్య పోతున్నారు.
పురంధేశ్వరి !మీది అధికార దాహం కాదా?!
నీడపట్టున హాయిగా కూర్చునే నాయకుల్ని ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపఎన్నికల ప్రచారానికి బలవంతంగా పంపించింది. జగన్ న్నే టార్గెట్ గా చేసుకొని మాట్లాడమని నాయకుల్ని నియోజక వర్గాలపైకి వదిలింది. అలవచ్చిన కేంద్రమంత్రి పురంధేశ్వరి జగన్ ది అధికార దాహం అని ఆరోపణలు చేసింది. నిజమే! మరి "మీది అధికార దాహంకాదా " అని ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేసి ప్రశ్నిస్తున్నారు.తండ్రి నందమూరి తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ అయిన తెలుగు దేశంలో కాకుండా, అధికారం కోసం ఎ పార్టీ అయితే ఏమి అనే ఆలోచనతో...పదవీ కాంక్ష ఉన్నప్పుడు పార్టీ సిద్దాంతాలతో పనిలేదనే అభిప్రాయంతో కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవిని పొందింది. ఇది అధికార దాహంకాదా అని పురంధేశ్వరి ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలుగు దేశం పగ్గాలు చంద్రబాబు చేతికి పోయాక బాబుతో పోటీపడలేని ఈ దంపతులు రామారావు పేరుతో కాంగ్రెస్ లో పదవిని పొంది అనుభవించేది అధికార దాహంకాదా అని మేథావులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వాలూ ...ప్రజలు గమనిస్తున్నారు!!
కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపితంగా అనుసరిస్తున్న ద్వంద వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్న నాయకులను కేంద్రం పార్టీలను బట్టి , కొందరితో కేంద్రప్రభుత్వానికున్న అభిప్రాయ బేధాల్ని బట్టి సి.బి.ఐ.ద్వారా విచారణ చేయిస్తుంది, ఐ.టి.దాడులు చేయిస్తుంది. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంత అవినీతికి పాల్పడ్డా ప్రభుత్వం రక్షిస్తుంది అని నాయకులకు ధీమాను కలుగ జేస్తుంది కేంద్ర ప్రభుత్వం. లిక్కర్ సిండికేట్ వ్యవహారం లోనూ, ఓక్స్ వ్యాగన్ వ్యవహారాలలో ఆరోపణలు ఎదుర్కుంటున్న బొత్స సత్యనారాయణ సి.బి.ఐ.గూర్చి భయంలేక పోగా తన వ్యవహారంలో దూకుడుగా ప్రదర్శిస్తున్న పోలీస్ ఆఫీసర్నే మార్పించాడు ప్రభుత్వం అండతో. వై.ఎస్.ఆర్. ఆత్మగా చెప్పుకునే కే.వి .పి. రామచంద్ర రావు కాంగ్రెస్ తరఫున ప్రచారంలో మునిగిపోయారు గాని సి.బి.ఐ.కి సంబంధించిన భయం లేదు. కంటితుడుపుగా మంత్రి మోపిదేవిని పట్టించుకో పోయినా చాలామంది మంత్రులను కేంద్రం కాపాడుకుంటూ వస్తుంది. జైలు పాలైనందుకు మోపినేనికి బహిరంగంగానే సహచర ప్రజాప్రతినిధులు సానుభూతిని ప్రకటిస్తున్నారు. పార్టీలు సారా పోయించినా, డబ్బులు పంచినా ఎ రూపంలో ప్రలోభ పెట్టిన ఓటరు ఓటింగు రోజున ఇటువంటి ద్వంద వైఖరిని ప్రదర్శించే పార్టీలకు బుద్ధి చేబుతారనేది నగ్న సత్యం.
2014 ప్రధాని పదవి రాహుల్ గాంధీకి కలే!
భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భవించి, స్వాతంత్ర్యానంతరం నెహ్రు కుటుంబం స్వార్థం కోసం రాజకీయ పార్టీగా మలిచబడిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి వారసత్వంగా రాహుల్ గాంధీని ప్రధానిపదవిలో కూర్చోబెట్టాలని వ్యూహం పన్నుతుంది. ఇది జరగని పని అని కాంగ్రెస్ వారు గ్రహించడం లేదు. ఈ మూడేళ్ళ పాలనా కాలం లో అనేక కుంభకోణాలు, ప్రజా వ్యతిరేక పనులు, అధిక ధరలు, చట్టాలను అనుకూలంగా మలుచుకొని వ్యవహరించిన తీరు. ఇటువంటివెన్నో ఇటీవలి కాలంలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి తార్కాణం. తన కుమారుడ్ని ప్రధానిగా చూసుకోవాలనే కోరిక సోనియాగాంధికి ఉంటే ఈ రెండేళ్ళ సమయాన్నైనా ప్రధాని పదవిగా ఉపయోగించుకుంటే మంచిదని మేథావులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాని పదవిని తృణప్రాయంగా సోనియమ్మవదిలేసినట్లు కాంగ్రెస్ వారు సోనియాను త్యాగ మూర్తిగా అభివర్ణిస్తున్నారు. విదేశీయులు దేశ ప్రధాని లాంటి అత్యున్నత పదవి స్వీకరించ కూడదని బి.జే.పి.వారు తీవ్రంగా విమర్శించడంతో, దేశంలో ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో (మన్మోహన్ సింగ్ ను బొమ్మలా కూర్చోబెట్టి) ప్రధాని అధికారాలను సోనియా చలాయిస్తున్నారు అనే విషయాన్నీ ప్రజలు గ్రహించలేని అమాయకుల్ల అనామక నాయకులు అమాయకంగా మాట్లాడుతున్నారు. ఈసారి వారసత్వంగా గాంధీ కుటుంబం నుంచి ప్రధాని రావడాని ప్రజలు నిరోదించే క్రమంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ముందస్తు హెచ్చరికగా ప్రజలు కాంగ్రెస్ కు భవిష్యత్తును తెలియజేశారు.
Monday, June 4, 2012
ద్వందనీతి కాంగ్రెస్
కేంద్రమంత్రి గులాం నబి ఆజాద్ ప్రచారం చేస్తూ "రాజు మరణిస్తే కుమారునికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టటానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు" అని అన్నారు. ఇందిరాగాంధీ మరణించిన వెంటనే రాజీవ్ గాంధీని ప్రధానిగా ఏ ఉద్దేశంతో ఏమని చేశారో సమాధానం చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు ఒకనీతి, బయటివారికి ఒక నీతి. కాంగ్రెస్ వారి ఈ ద్వంద నీతిని ప్రజలు తిరస్కరిస్తున్నారు.
హడలెత్తి పోతున్న ఇటలీ కాంగ్రెస్ సేన.
జరగనున్న 18 స్థానాల ఉపఎన్నికలు ఇటలీ కాంగ్రెస్ సేనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.గతంలో ఏ ఎన్నికలకు కాంగ్రెస్ నియోజక వర్గాల వారిగా ఇంతమందిని ఇంచార్జ్ లుగా నియమించింది లేదు. అలా నియమింప బడినవారు ఇంత కష్టబడి పనిచేసిందీ లేదు. సర్వ శక్తులువొడ్డి నాయకులు నియోజకవర్గాలు తిరుగుతున్నారు. అయినా జనాలు లేక వెలవెల బోతున్నాయి వారి రోడ్ షోలు. ఇక్కడి ఎం.ఎల్.ఏ.లు,ఎం.పీ.లు, మంత్రులు సరిపోలేదు అన్నట్లు కేంద్రమంత్రి గులాం నబి ఆజాద్ ను ప్రచారంలో దించారు. అయినా రోడ్ షో లు లో జనాలు అరకొరే. సోనియా గాంధీ బొమ్మబెట్టుకొని గెలిచాము అని సిగ్గు లేకుండా పచ్చిగా చెప్పిన ఈ నాయకులు స్వయంగా సోనియాగాంధీని ప్రచారానికి తీసుకొచ్చినా పరాభవం తప్పదంటున్నారు కొందరు వై.కా.పా.నేతలు. ప్రజలను ప్రలోభపరిచే ఎన్ని మాటలు చెప్పినా ఎన్నికలలో అంతిమ విజయం తమాదేనని ధీమాను వ్యక్తం చేస్తున్నారు వై.కా.పా. నేతలు.
పార్టీలకు అతీతంగా...
తెలుగు దేశం పత్రికగా ముద్రపడిన "ఈనాడు", బాబు బినామి పత్రిక గా బయట ప్రజలు అనుకునే "ఆంధ్రజ్యోతి" పార్టీలకు అతీతంగా(వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మినహాయించి) జగన్ కేసు వెలుగులో కొచ్చినది మొదలు వార్తలు ప్రచురించడం ప్రజలకు విస్మయాన్ని కలుగ జేస్తుంది. అన్ని పార్టీల ఉమ్మడి శత్రువు జగన్ అన్నట్లు అన్ని పార్టీలవారు స్నేహితుల్లా వ్యవహరిస్తున్నారు. జగన్ గూర్చి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఈ పేపర్లలో వార్తగా చోటుచేసుకుంటున్నాయి. ఏది ఏమైనా జగన్ వ్యవహారం ద్వారా ఏకమైన ఈ నాయకుల ఈ రకమైన స్నేహం, ఈ పత్రికలు వారి మాటకు విలువిస్తూ ప్రచురించే ఈ వార్తల అనుబంధం ఎంతకాలం నిలిచి ఉంటుందో వేచి చూడాలి.
కేంద్రం కనుసన్నల్లో కీలక శాఖలు
సి.బి.ఐ.కేంద్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తుంది అని ఇటీవల జగన్ వ్యవహారంలో మాత్రమే సి.బి.ఐ. వ్యవహరిస్తున్న తీరునుబట్టి ఇట్టే అర్థమై పోయింది. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా...పనిచేసినా ఇటలీ కాంగ్రెస్ చట్టాన్ని తనచేతిలోకి తీసుకొని బెదిరిస్తుందని నిరూపించే మరో తాజా సంఘటనే బాబా రాందేవ్ ట్రస్ట్ వ్యవహారాలలో వివిధ శాఖలు వ్యవహరిస్తున్న తీరు. కేంద్రప్రభుత్వం అవినీతి పై, అనేక విషయాలపై ఆరోపణలు గుప్పిస్తూ అన్నా హజారే ,బాబా రాందేవ్ సంయుక్తంగా దీక్ష చేస్తున్నందుకు కేంద్రప్రభుత్వం ప్రతిచర్య మొదలైంది. 58 కోట్లు కట్టాలని ఐ.టీ.శాఖ, యోగా శిభిరాలద్వార వచ్చిన ఆదాయంపై 4.94 కోట్లు సేవా పన్ను కట్టాలంటూ సేవా పన్ను విభాగం వారు రాందేవ్ కు దీక్ష చేస్తున్న ఈ సమయంలో నోటీసులు ఇవ్వడం వెనుకున్న కేంద్రప్రభుత్వం ప్రమేయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సి.బి.ఐ. నే కాదు, ఐ.టీ.శాఖ, సేవా పన్ను విభాగం ఇలా ఏ శాఖలనైనా తమ స్వప్రయోజనాలకు వాడుకుని బెదిరించే కాంగ్రెస్ నైజాన్నిగమనించవచ్చు. నిజంగా రాందేవ్ అంత డబ్బు కట్టాలే అనుకుందాము. మరి ఇన్నాళ్ళు నోటీసులు ఇవ్వకుండా ఈ శాఖలు మౌనంగా ఎందుకున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.ఉద్యోగులుగా విధులను ఇంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు,మేథావులు డిమాండ్ చేస్తున్నారు. కాలం దగ్గరబడినప్పుడు పార్టీలు ఇలానే వ్యవహరిస్తాయని ప్రజలు అనుకుంటున్నారు.
Subscribe to:
Posts (Atom)