Tuesday, January 24, 2012

బంగారం దొరికినంత ఆనందం





చైన్ స్నాచింగ్ ఘటనలో బంగారం పోయిన 17  జనవరి 2012  న పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ రాసి ఇస్తే పోలీసుల లెక్కప్రకారం చాలా వేగంగా అంటే వారం రోజుల తర్వాత మీము ప్రతిరోజు వారిని దర్శించుకొని, కొన్ని గంటలపాటు నిరీక్షించగా,డి.ఎస్.పి. గారి దృష్టికి F.I.R. రాసి ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంగూర్చి వివరించగా ఈ రోజు అనగా 24  జనవరి 2012  న మేము అభ్యర్దించిన రీతిగా కేసు నమోదుచేసి జిరాక్స్ కాపీ ఇవ్వడమైనది. మేము కంపైంట్ రాసిన తేదీని,పోలీసువారు కేసు నమోదు చేసి ఇచ్చిన FIR కాపీ తేదీని మీరు గమనించవచ్చు. ఈ వారం రోజులు బంగారం పోయినదానికంటే పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయించడంలో పడిన బాధే ఎక్కువ. పోలీసు వారిది సమానత దృక్పథం. మనం ఎంతగొప్ప చదువైన చదువుకొని ఉండవచ్చు. మనం సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు...ఇవేవి మనకు న్యాయం చెయ్యవు. స్టేషన్ కు వెళితే అక్కడ భయం,బాధ్యతలు ఎరగని వారు,వారికి దన్ను అన్నట్లు పిల్ల నాయకులు. వారికి లభించే గౌరవ మర్యాదలు. వారిమధ్య నిజంగా న్యాయం జరగాల్సిన వ్యక్తులు బిక్కుబిక్కుమంటూ ఏదో ఓమూల ఉండాల్సిన పరిస్థితి. మరో 50  ఏళ్ళు అయినా పోలీసు స్టేషన్ ల పరిస్థితి ఇంతే ఉంటుంది. అక్కడ సేవాభావం, మానవీయత , గౌరవం ఏ కోశానా కనిపించవు. చిన్న సంఘటనద్వార వారంలో నేను కళ్లారా చూసిన విషయాలు.ఏది ఏమైనప్పటికీ FIR రాసి మా చేతికి అందించడం మాకు బంగారం దిరికినంత ఆనందాన్ని కలిగించింది. మేము పోగొట్టుకున్న బంగారం మా చేతికి ఎన్నాళ్ళకి  పోలీసులు అందిస్తారో వేచి చూడాలి.    

No comments:

Post a Comment