Wednesday, January 25, 2012

ది గ్రేట్ ఇండియా The Great India

భారత దేశ ప్రజలు సహనశీలులు, శాంతి కాముకులు. ఎవరిద్వారనైన ఇబ్బందిని అనుభవించాల్సి వస్తే  "దాని/వారి  పాపాన అదేపోతుంది"....లేదా " మన కర్మ ఇంతే " అని సరిపెట్టుకునే కర్మ సిద్దాంత పండితులు అని నిరూపించే ఘటన కొన్ని ఏళ్లుగా సాగుతుంది. స్థానిక అనకాపల్లి కొత్తూరు కాలేజీ జంక్షన్ వద్ద రైల్వే క్రాసింగ్ రోడ్ పై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమై మూడు సంవత్సరాలు దాటి పోతుంది. ఏ ఒక్కటి సక్రమమైన పద్దతిలో జరగలేదు. ఒక వంతెన నిర్మాణం జరిగేటప్పుడు ఆ మార్గాన వెళ్ళే వారికి పక్కగా మార్గాన్ని నిర్మించిన తర్వాత బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలి. నిర్మాణ పనులు ప్రారంబించిన రోజు మొదలు ఈ మార్గంగుండా వెళ్ళే ప్రజలకు నరకంగా మారిపోయింది ప్రయాణం. వర్షాకాలం లో బురదలో పడి కళ్ళు చేతులు విరగ గొట్టుకున్న వాళ్ళు  ఎందఱో...ఇతర కాలాలలో ఈ మార్గాన నడిచిన వారు పీలుస్తున్న దుమ్మూ ధూళి గూర్చి చెప్పసాధ్యంకాదు. ప్రజలు ఫిర్యాదు చెయ్యరు...పంచాయితీ సర్పంచులు...అధికారులు...నాయకులు కమీషన్లు పుచ్చుకొని ఏమీ ఎరగనట్లు ఉంటున్నారు. అధికారగణం ఇప్పటికైనా మేల్కొని ప్రజల్ని ఈ ఇబ్బందుల నుంచి రక్షించ వలసిందిగా  కొందరు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు  .
ఈ వీడియో దృశ్యంలో మీరు గమనించవచ్చు బురదతో కాదు అవినీతి బురదతో ఆ మార్గం ఎలా రాజకీయ రొచ్చులా ఉందొ. ది గ్రేట్ ఇండియా. ది గ్రేట్ గవర్నమెంట్.

Tuesday, January 24, 2012

బంగారం దొరికినంత ఆనందం





చైన్ స్నాచింగ్ ఘటనలో బంగారం పోయిన 17  జనవరి 2012  న పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ రాసి ఇస్తే పోలీసుల లెక్కప్రకారం చాలా వేగంగా అంటే వారం రోజుల తర్వాత మీము ప్రతిరోజు వారిని దర్శించుకొని, కొన్ని గంటలపాటు నిరీక్షించగా,డి.ఎస్.పి. గారి దృష్టికి F.I.R. రాసి ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంగూర్చి వివరించగా ఈ రోజు అనగా 24  జనవరి 2012  న మేము అభ్యర్దించిన రీతిగా కేసు నమోదుచేసి జిరాక్స్ కాపీ ఇవ్వడమైనది. మేము కంపైంట్ రాసిన తేదీని,పోలీసువారు కేసు నమోదు చేసి ఇచ్చిన FIR కాపీ తేదీని మీరు గమనించవచ్చు. ఈ వారం రోజులు బంగారం పోయినదానికంటే పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయించడంలో పడిన బాధే ఎక్కువ. పోలీసు వారిది సమానత దృక్పథం. మనం ఎంతగొప్ప చదువైన చదువుకొని ఉండవచ్చు. మనం సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు...ఇవేవి మనకు న్యాయం చెయ్యవు. స్టేషన్ కు వెళితే అక్కడ భయం,బాధ్యతలు ఎరగని వారు,వారికి దన్ను అన్నట్లు పిల్ల నాయకులు. వారికి లభించే గౌరవ మర్యాదలు. వారిమధ్య నిజంగా న్యాయం జరగాల్సిన వ్యక్తులు బిక్కుబిక్కుమంటూ ఏదో ఓమూల ఉండాల్సిన పరిస్థితి. మరో 50  ఏళ్ళు అయినా పోలీసు స్టేషన్ ల పరిస్థితి ఇంతే ఉంటుంది. అక్కడ సేవాభావం, మానవీయత , గౌరవం ఏ కోశానా కనిపించవు. చిన్న సంఘటనద్వార వారంలో నేను కళ్లారా చూసిన విషయాలు.ఏది ఏమైనప్పటికీ FIR రాసి మా చేతికి అందించడం మాకు బంగారం దిరికినంత ఆనందాన్ని కలిగించింది. మేము పోగొట్టుకున్న బంగారం మా చేతికి ఎన్నాళ్ళకి  పోలీసులు అందిస్తారో వేచి చూడాలి.    

Monday, January 23, 2012

మారని పోలీసుల వైఖరి

18 జనవరి 2012     సాక్షి దినపత్రిక

18 జనవరి 2012     ఈనాడు దినపత్రిక

18 జనవరి 2012     ఆంధ్రజ్యోతి దినపత్రిక

18 జనవరి 2012     సాక్షి దినపత్రిక

18 జనవరి 2012     వార్త దినపత్రిక

18 జనవరి 2012     ఆంధ్రభూమి దినపత్రిక

దొంగలు బంగారం లాక్కుపోయిన ప్రాంతం ( గూగుల్ ఎర్త్ ద్వారా గుర్తించినది)

దొంగలు బంగారాన్ని బలంగా లాక్కుపోగా   మెడభాగాన ఒరుసుకుపోయిన గుర్తు.  


చైన్ స్నాచింగ్ కు సంబంధించి పోలీసు స్టేషన్ లో రిపోర్ట్ చేసి వారంరోజులు కావస్తున్న ఇప్పటివరుకు మా చేతికి F.I.R. కాపీ అందలేదంటే పోలీసులు ఎంత శ్రద్దగా విధులు నిర్వహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. బాధితులపట్ల వారి స్పందన ఎలా ఉందో గ్రహించవచ్చు. కంప్లైంట్ తీసుకున్నట్లు కేసు నమోదుచేసినట్లు F.I.R. కాపీ కోసం ఐదారు సార్లు  గంటలకొద్దీ నిరీక్షించడమే అవుతుందిగాని పోలిసులవైపునుంచి నేటివరకు మాకు స్పందన కనిపించడంలేదు.     

Wednesday, January 18, 2012

దోపిడీలకు, దొంగతనాలకు అడ్డాగా అనకాపల్లి !?

ఆంధ్రదేశంలో ఇతర ప్రాంతాలలో జరుగుతున్న నేరాల స్థాయిలోనే అనకాపల్లిలోనూ జరుగుతున్నాయి. దొంగతనాలకు దోపిడీలకు అనకాపల్లి అడ్డగా మారుతుందా అనిపిస్తుంది.17 జనవరి  2012 న ఒకే రోజు పలు దోపిడీలు,దొంగతనాలు జరిగాయి. శారదానగర్ 6  వ వీధిలో ఉంటున్న మా కుటుంబ మిత్రులు గట్టి బ్రహ్మాజీ గారి కుటుంబాన్ని కలిసి వారికి స్వీట్స్ ఇవ్వాలని వారి ఇంటికి నా భార్య ఎస్తేర్ రాణి, కుమార్తె సంకీర్తన వెళుతుండగా బైకుపై మా వారిని అనుసరించిన ఆగంతకులు వారిని దాటుకొని ఎదురొచ్చి నా భార్య మెడలోని సుమారు మూడున్నర తులాల బరువుగల నాన్తాడు,చైన్ ను లాక్కు పోయారు. ఈ సంఘటనగూర్చి పోలీసులకు తెలియజేసి స్టేషన్ కు   వెళ్లి అదేరోజు ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు కాపీ అయితే స్వీకరించారుగాని మాకు ఎటువంటి రశీదు,కాగితం వారు ఇవ్వలేదు. పోయిన మా బంగారాన్నివారు నేరస్తులను పట్టుకొని మాకు వచ్చేలా చెయ్యగలరని ఆశిస్తున్నాము.

Saturday, January 14, 2012

money media మనీ మీడియా


మనీ మీడియా 
మీడియా ప్రజాపక్షం వహిస్తుందని అనుకోవడమంత పొరపాటు మరొకటిలేదు అని నిరూపించే విషయాలు ఎన్నో...!ప్రతీ రోజు బేవార్స్ లు బాబాలుగా పుట్టుకోస్తున్నారని ఒకవైపు న్యూస్ చానెల్స్ కథనాలు ప్రసారం చేస్తాయి. గతంలో ఇదే బాబాలుగూర్చి ప్రసారం చేసిన చానల్సే ఈయనగారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యక్ష ప్రసారాలు చేసాయి.  డబ్బు లివ్వలేగాని మీరెలా పళ్ళు తోముకుంటారో ప్రత్యక్ష ప్రసారం చెయ్యడానికి ఎల్ల వేళల చానల్స్ అన్నీ సిద్ధంగా ఉంటాయి.