Saturday, July 7, 2012

అతితెలివి ఘనాపాటి లగడపాటి !



   
  ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో నాయకులు ఎన్ని ఎత్తులేస్తారో అనే విషయానికి ఉదాహరణగా నిలిచినవాడు లగడపాటి రాజగోపాల్. స్పష్టమైన, ప్రధానమైన అభియోగాలకు సమాధానం చెప్పాల్సినవాడు చెప్పకుండా నోరుమూసుకొని తప్పించుకొని తిరుగుతుంటే..లగడపాటి లాంటి కొందరు నాయకులు మాత్రం బయటబడిన బాగోతాన్ని ఎలా సమర్ధించుకోవాలా అని తెగ పరిశోధనలు  చేసేస్తున్నారు. చట్టాలు తిరగేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...
     అక్రమార్జన కేసుకు సంబంధించి సి.బి.ఐ.విచారణ అంశాలను జే.డి.లక్ష్మినారాయణ కొన్ని మీడియాలకు ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని చేరవేశాడు అనేందుకు సాక్ష్యంగా నిలిచినా జే.డి.లక్ష్మినారాయణ కాల్ లిస్టు ను వై.కాపా.నేతలు బయటబెట్టారు. దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి జే.డి. ఆయన సమాధానం చెప్పకపోగా, ఆయన నిబద్ధత గూర్చి కొందరు సర్టిఫికేట్ ఇచ్చేస్తునారు. మనం చెప్పినట్లు,మనకోసం పనిచేసిన వ్యక్తి ఉహించని రీతిలో సమర్ధించుకోలేని వివాదంలో ఉంటే మనవాడిగా మనం ఆయనమీద వచ్చే విమర్శలు తిప్పిగొట్టా లన్నట్లు నిన్న వి.హెచ్. నేడు లగడపాటి మాట్లాడుతున్నారు. నిజమే, సి.బి.ఐ. మాన్యువల్ లోని 24 .9  , 24 .11 నిబంధనలను అనుసరించి వివిధ అంశాలను సి.బి.ఐ.మీడియాకు చెప్పవచ్చు.
అయ్యా లగడపాటి! మీ అతితెలువులు ప్రదర్శించకుండా ప్రజల ఈ సూటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి.
  •   జగన్ అరెస్ట్ ముందువరకు జే.డి.విచారణ చేస్తున్న కేసులకు సంబంధించి స్వయంగా జే.డి.నే. మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు,సన్నివేశాలు అన్ని టీవి చానెల్స్ వద్ద రుజువుగా కోకొల్లలు. ఒక్క జగన్ కేసు విషయంలోనే ...అరెస్ట్ చేసే ముందునుంచి ఇప్పటివరకు మీడియా ముందుకువచ్చి అంతకు ముందులా విచారణ విషయాలు ఏ నిబంధనలను అనుసరించి చెప్పలేదో మేథావి అయిన లగడపాటి గారూ! మీరు అజ్ఞానులైన ప్రజలకు చెప్పగలరా?
  • సరే!... సి.బి.ఐ. మాన్యువల్ లోని నిబంధనలను అనుసరించి మీడియా అందుబాటులో ఉన్నా...అంతకు ముందులాగాక ఫోన్ ద్వారా  సమాచారాన్ని చేరవేశారనుకుందాము. మీడియా ఫోన్ చేస్తే విచారణకు సంబంధించిన విషయాలు చెప్పడ్డమే పలు అనుమానాలకు దారితీస్తాయని అనుకుంటే జే.డి.నుంచి మీడియాకు కాల్స్ వెళ్ళడం ఏమిటి? ఇదేమైన జే.డి.ఇంట్లో పెళ్ళా?స్వయంగా తనే వారికి ఫోన్ చేసి అయ్యా కేసు ఇలా ఉంది అని చెప్పడానికి ?! అలా చెప్పడమే తన భాద్యత అయినప్పుడు అన్ని చానెళ్లకు చెప్పాలిగా?
  • వాసిరెడ్డి చంద్రబాల జే.డి.కి, మీడియాకు మీడియేటర్ కాదు, ఆమె చెప్పినట్లే క్లాస్మేట్ అని చెప్పినప్పుడు వస్తున్న నిందలలో నిజం లేదు...ఇదిగో జగన్ అరెస్ట్ ముందునుంచే మా ఇద్దరికీ ఫోన్ కంటాక్స్ ఉన్నాయి అని ప్రజల అనుమానాలకు నివృతి చేసేలా అటు జే.డి.గాని, ఇటు చంద్రబాల గాని ఎప్పటి నుండో సాగుతున్న   పరిచయాన్ని ద్రవపరిచే కాల్ లిస్టు ను ఇద్దరిలో ఎవరో ఒకరు  వారే స్వయంగా బయట పెట్టొచ్చుకదా జనం నమ్ముతారు? 
  • ఇప్పటివరకు ఏ మీడియా, ఏ పార్టీ  ఏ కేసులోనూ...ఏ సందర్భంలోనూ కాల్ లిస్ట్లను ప్రవేశ పెట్టలేదా? వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు ఈ కాల్ లిస్టు విషయాలో ఇంత రాద్దాంత మెందుకు?
పై విషయాలకు సమాధానం చెప్పాల్సినవారు,నిరూపించుకోవాల్సిన వారు నిరూపించుకో కుండా, తగుదునమ్మా అంటూ తెగ పరిశోధనలు చేసేసి కొండనితవ్వి ఎలుకని బట్టినట్లు ,లగడపాటి నిబంధనల నీతి కబుర్లు చెబుతున్నాడు. ఉప ఎన్నికల్లో ఎన్ని ఎత్తులేసినా జనం ముడ్డిమీద వాతబెట్టినా ఈ కాంగ్రెస్ వారికి బుద్దిరాలేదని అనుకుంటున్నారు. 

2 comments: