Sunday, December 4, 2011

ప్రభుత్వం ఉందా ?


కిరణ్ ప్రభుత్వం ఏదో... ఏదేదో చేస్తుందని అనుకున్నారు. కాని ప్రజల జీవితాల్ని ఇలా చీకటిమయం చేస్తుందని అనుకోలేదు. అధినాయకులకు ప్రజల అవసరాల గూర్చి...ప్రజల అవస్థలగూర్చి ఆలోచనలేదు. వాళ్ళ ఆలోచనల్లా పదవుల్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా దోచెయ్యాలి అనే..! ప్రజాపక్షం అని చెప్పుకునే వార్తా పత్రికలు, టి.వి.ఛానెల్స్ ప్రభుత్వాలకు కొమ్ముకాస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ఒక్క మాటకూడా రాయడం లేదు. ఇక ప్రతిపక్షాల గూర్చి చెప్పనే అక్కరలేదు.  ఎలక్షన్ సమయమైతే ఉల్లిపాయలు, టమోటాలు అన్నీ వారి ప్రచార అస్త్రాలే. ఇప్పుడు ఆంధ్రదేశ ప్రజల్ని ఏలుతున్న కరెంటుకోతలు వాళ్ళకు సమస్యే కాదు. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం ముఖ్యం కాదు. ప్రజలపై వ్యాపారం చేస్తున్నాయి. కరెంటు వారికి వ్యాపార వస్తువే! సోలార్ పవర్ ప్రోత్సహించరు ఎందుచేతనంటే ప్రజల్ని మత్తులో ముంచే "కరెంటు"; ప్రజల్ని చీకటిలోకి నెట్టే  కరెంట్ రెండు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యాపార వతువులు..మొన్నటి వరకు కరెంట్ కోతలపై తెలంగాణా-సింగరేణి సమ్మెలు సాకులు అని చెప్పుకొచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడెందుకు కరెంటు ఇవ్వలేకపోతున్నాయో చెప్పడం లేదు. కొన్ని ప్రశ్నలకు నాయకులు అధికారులు సమాధానం చెప్పాలి. మీడియా సమాధానాలు వీరినుంచి రాబట్టాలి.
  • కరెంట్ కోతలకు పరిష్కారమార్గంగా ప్రభుత్వం చేపట్టబోయే చర్యలేమిటి?
  • ప్రతిపక్షాలు కరెంట్ కోతలపై పాలక పక్షాన్ని ప్రజల పక్షాన ఎందుకు ప్రశ్నించడం లేదు ?
  • కరెంటు కోతలపై పట్టనట్లు ఉండే ప్రభుత్వం, ప్రతిపక్షం తీరుపై మీడియా కధనాలు ఎందుకు ప్రసారం చెయ్యడం లేదు?
  • కరెంట్ కోతలనుంచి ప్రజలకు విముక్తి ఎప్పుడు?

No comments:

Post a Comment