తెలంగాణా కోసం ప్రజానాయకులు చేసిన రాజీనామాలను శంకించాల్సి వస్తుంది. ఏ పని చేసినా అదును చూసి చెయ్యాలని నిరూపించారు. ప్రజల వత్తిడి మేరకు నాయకులు రాజీనామాను చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడి, తెలంగాణా నాయకులూ..స్పీకర్ ...ముఖ్యమంత్రి ఆడిన..,ఆడుతున్న రసవత్తర డ్రామాగా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే స్పీకర్ విదేశ పర్యటనలో ఉన్నప్పుడే చెయ్యడమనేది...మొదట బహిష్కృత తెలుగుదేశం నేతలు ఆతర్వాత ఒక్కొక్కరిగా ఒకరరిని చూసి ఒకరు ఆమోదించే రాజీనామాలు కాదుగదా అని"ప్రజల్లో మనం మాత్రం చెడ్డవడం దేనికని" రాజీనామాలు చేసినట్లు "నాయకులు నటనలో జీవించారన్నది " ప్రజలు గ్రహించారు. ఒక నాయకుడు పదవికి రాజీనామాను చేసినప్పుడు ఏ కారణాలచేత దానిని ఆమోదించకుండా నాన్చుతున్నారో అర్థం కావడంలేదు. నిజంగా చిత్త శుద్ధి ఉన్న నాయకులైతే రాజీనామాలును ఆమోదింప జేసుకొని మాది రాజీనామాల డ్రామా కాదని నాయకులు తక్షణమే నిరూపించుకునే ప్రయత్నం ప్రారంభించాలి. అప్పుడే ప్రజలు నాయకుల్ని నమ్ముతారు.
No comments:
Post a Comment