Sunday, December 4, 2011

ప్రభుత్వం ఉందా ?


కిరణ్ ప్రభుత్వం ఏదో... ఏదేదో చేస్తుందని అనుకున్నారు. కాని ప్రజల జీవితాల్ని ఇలా చీకటిమయం చేస్తుందని అనుకోలేదు. అధినాయకులకు ప్రజల అవసరాల గూర్చి...ప్రజల అవస్థలగూర్చి ఆలోచనలేదు. వాళ్ళ ఆలోచనల్లా పదవుల్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా దోచెయ్యాలి అనే..! ప్రజాపక్షం అని చెప్పుకునే వార్తా పత్రికలు, టి.వి.ఛానెల్స్ ప్రభుత్వాలకు కొమ్ముకాస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ఒక్క మాటకూడా రాయడం లేదు. ఇక ప్రతిపక్షాల గూర్చి చెప్పనే అక్కరలేదు.  ఎలక్షన్ సమయమైతే ఉల్లిపాయలు, టమోటాలు అన్నీ వారి ప్రచార అస్త్రాలే. ఇప్పుడు ఆంధ్రదేశ ప్రజల్ని ఏలుతున్న కరెంటుకోతలు వాళ్ళకు సమస్యే కాదు. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం ముఖ్యం కాదు. ప్రజలపై వ్యాపారం చేస్తున్నాయి. కరెంటు వారికి వ్యాపార వస్తువే! సోలార్ పవర్ ప్రోత్సహించరు ఎందుచేతనంటే ప్రజల్ని మత్తులో ముంచే "కరెంటు"; ప్రజల్ని చీకటిలోకి నెట్టే  కరెంట్ రెండు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యాపార వతువులు..మొన్నటి వరకు కరెంట్ కోతలపై తెలంగాణా-సింగరేణి సమ్మెలు సాకులు అని చెప్పుకొచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడెందుకు కరెంటు ఇవ్వలేకపోతున్నాయో చెప్పడం లేదు. కొన్ని ప్రశ్నలకు నాయకులు అధికారులు సమాధానం చెప్పాలి. మీడియా సమాధానాలు వీరినుంచి రాబట్టాలి.
  • కరెంట్ కోతలకు పరిష్కారమార్గంగా ప్రభుత్వం చేపట్టబోయే చర్యలేమిటి?
  • ప్రతిపక్షాలు కరెంట్ కోతలపై పాలక పక్షాన్ని ప్రజల పక్షాన ఎందుకు ప్రశ్నించడం లేదు ?
  • కరెంటు కోతలపై పట్టనట్లు ఉండే ప్రభుత్వం, ప్రతిపక్షం తీరుపై మీడియా కధనాలు ఎందుకు ప్రసారం చెయ్యడం లేదు?
  • కరెంట్ కోతలనుంచి ప్రజలకు విముక్తి ఎప్పుడు?

Friday, July 15, 2011

రాజీనామాల డ్రామా


undavalli with telangaana leaders  
తెలంగాణా కోసం ప్రజానాయకులు చేసిన రాజీనామాలను శంకించాల్సి వస్తుంది. ఏ పని చేసినా అదును చూసి చెయ్యాలని నిరూపించారు. ప్రజల వత్తిడి మేరకు నాయకులు రాజీనామాను చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడి, తెలంగాణా నాయకులూ..స్పీకర్ ...ముఖ్యమంత్రి ఆడిన..,ఆడుతున్న రసవత్తర డ్రామాగా ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే స్పీకర్ విదేశ పర్యటనలో ఉన్నప్పుడే చెయ్యడమనేది...మొదట బహిష్కృత తెలుగుదేశం నేతలు ఆతర్వాత ఒక్కొక్కరిగా ఒకరరిని చూసి ఒకరు ఆమోదించే రాజీనామాలు కాదుగదా అని"ప్రజల్లో మనం మాత్రం చెడ్డవడం దేనికని" రాజీనామాలు చేసినట్లు "నాయకులు నటనలో జీవించారన్నది " ప్రజలు గ్రహించారు.  ఒక నాయకుడు పదవికి రాజీనామాను చేసినప్పుడు ఏ కారణాలచేత దానిని ఆమోదించకుండా నాన్చుతున్నారో అర్థం కావడంలేదు. నిజంగా చిత్త శుద్ధి ఉన్న నాయకులైతే రాజీనామాలును ఆమోదింప జేసుకొని మాది రాజీనామాల డ్రామా కాదని నాయకులు తక్షణమే నిరూపించుకునే ప్రయత్నం ప్రారంభించాలి. అప్పుడే ప్రజలు నాయకుల్ని నమ్ముతారు.

Thursday, April 7, 2011

Talathoti Prithvi Raj's saport to Anna Hazare's fasting

ప్రముఖ కవి, ఇండియన్ హైకూ క్లబ్ అధ్యక్షులు,అవినీతి రహిత సమాజ కాంక్షి డా.తలతోటి పృథ్వీ రాజ్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న శ్రీ అన్న హజారేకు మద్దతు ప్రకటించారు. హజారే కోరిన రీతిగా జన్ లోక్ పాల్ ను చట్టం చెయ్యాలని పృథ్వీ రాజ్ డిమాండ్ చేశారు. స్విస్స్ బ్యాంకు లో నల్ల ధనాన్ని దాచినవారి పేర్లను వెల్లడించేందుకు కేంద్రప్రభుత్వం కుంటిసాకులు చెబుతుంది. ఆ నల్ల ధన్నాన్ని స్వదేశానికి తెప్పించి దేశాభివృద్దికి ఖర్చుపెడతాము అనికూడా స్పష్టమైన హామీ కేంద్రప్రభుత్వం ఇవ్వడం లేదు. కారణం ఏమిటంటే ఆ నల్లదనం మన రాజకీయ నాయకులదే గనుక. వారిని వెనకుండి నడిపించే పెట్టుబదిదారుల్డికూడా గనుక. రానున్న ఎన్నికల్లో ఈ నల్లదనం పై కేంద్ర తీసుకునే నిర్ణయమే కాంగ్రెస్ ను గట్టేక్కిస్తుంది అని పృథ్వీ రాజ్ అన్నారు.