Saturday, December 18, 2010

అనకాపల్లి న్యూస్. కామ్



ఎక్కడ చూసినా అన్యాయాలు...అవినీతి...అక్రమాలు...దగా...మోసం...! శ్రీ శ్రీ గారు అన్నట్లు "కుడి ఎడమల దగా దగా"ఇలాంటివాటికి అనకాపల్లి ఏమి తీసిపోలేదు.తూకల్లో మోసాలు...నాణ్యతలో మోసాలు...,పెట్రోల్ బంకుల్లో కల్తీ...సినిమా హాళ్లల్లో అసౌకర్యాలు...ఇలా చెప్పుకుంటే ఎన్నో...ఇలాంటివి ఎందుకు సాగుతాయి అంటే ప్రజల్లో చైతన్యం  కొరవడింది కనుక.అన్యాయాన్ని నిలదీసే ధైర్యం..సమయం మనకు లేదుగనుక! మనింటిముందో...మనవీదిలోనో బెల్ట్ షాప్ లు. అయినా మనం సహిస్తాము..భరిస్తాము. కారణం మనకు తెలిసిన వాళ్ళో ...మనింటిపక్క వాళ్ళో ఆ షాప్ ను పెట్టారుగనుక. మరి పోలీసు వ్యవస్థ ఏమి చేస్తుంది?...ప్రజలపక్షం ఉన్నట్టు ఉంటుంది...వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నట్టు ఉంటారు. జరిగే అన్యాయాలు జరుగుతుంటాయి...అందే మామూళ్ళు  నెలవారీ అందుతుంటాయి....సడీ సప్పుడు లేకుండా జరగాల్సిన వన్నీ  జరిగిపోతూవుంటాయి. అవిచేస్తాము,ఇవిచేస్తాము అని ప్రజలకు హామీలు ఇచ్చి,గెలిచిన నాయకులూ ఏమి చేసినా చెయ్యక పోయినా , ప్రభుత్వాధికారులు చెయ్యాల్సిన విధులు చేసినా చెయ్యక పోయినా పర్వాలేదు.మనకొచ్చిన ఇబ్బందిలేదు. మన జీతం డబ్బులతో మనం బతికేస్తున్నాం. మన కూలి డబ్బులతో మనం బతికేస్తున్నాము. వ్యవస్థ లో ఏమి జరిగినా మనకు ఇబ్బంది రానివరకు మనకేం ఫర్వాలేదు అనే మనస్తత్వం మనలోనుంచి పోవాలి.
ఇలాంటి అనేక విషయాలపై ఉద్యమ స్థాయిలో న్యాయబద్దంగా,హక్కుల పరంగా,లోకానికి తెలియజేస్తూ,దోషులని ప్రపంచానికి తెలియజేస్తూ ప్రజల్ని చైతన్య పరిచేందుకే...మంచి సమాజాన్ని నిర్మించుకునేందుకే ఈ వెబ్ సైట్.      

No comments:

Post a Comment