Saturday, October 26, 2013

శారదానగర్ ఇళ్ళను ముంచేసిన వరద Anakapalli-Floods-Sarada nagar


 వారంరోజులపాటు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తుఫాన్ కు ఎప్పటిలాగే సత్యనారాయణ పురం , సాయిబుల కాలనీ , దేవీనగర్ , ఉత్తర భాగాన ఉన్న శారదానగర్ లో ఉన్న ఇల్లు ముంపుకు గురిఅయ్యాయి . శారదా నదికి దక్షిణాన మూల పేటనుంచి రైల్  బ్రిడ్జి వరకు గట్టు నిర్మించక పోవడం వల్ల ఈ పరిస్థుతులు పునరావృతం అవుతున్నాయి . ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు అధికారులు , నాయకులు హడావిడి చెయ్యడం మినహా శాశ్వత చర్యలకు పూనుకోవడంలేదు . సత్యనారాయణపురం గెడ్డ వల్ల శారదానగర్ ప్రాంతప్రజలు ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడం అలవాటైపోయింది ,

శారదా నగర్ పడమర దిక్కున ఉన్న ఇల్లు వరదనీటిలో దిగ్భంధం అయిన దృశ్యం 

సిక్కుల నివాసాలు , దేవీనగర్ లోని ఇల్లు వరదనీటి దిగ్భందంలో 

శారదా నదీతీరాన ఉన్న దేవాలయం ;మెట్ల అంచులను తాకుతున్న వరదనీరు 

నిండుకుండలా వరదనీటితో ప్రవహిస్తున్న శారదా నది 

నిండుకుండలా వరదనీటితో ప్రవహిస్తున్న శారదా నది 

వరదనీటిలో ఇల్లు మునిగిపోవడంతో వాణిజ్య భవనంలో తలదాచుకున్న సిక్కులు