అనకాపల్లి శారదానగర్ 6 వ వీధి లో నిర్మించిన శ్రీశ్రీనివాసా ఫంక్షన్ హాల్ నిర్వాహకుల తీరు స్థానికులకు ఆగ్రహాన్ని కలిగించింది. చట్టవ్యతిరేఖంగా నిర్మించిన ఈ ఫంక్షన్ హాల్ వల్ల శారదా నగర వాసులు తీవ్ర ఇబ్బందులకూ,శారీరక,మానసిక ఆరోగ్య సమస్యలకు గురిఅవుతున్నారు. అనకాపల్లి ఎ.ఎం.ఎ.ఎల్.కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ నాగభూషణం గారు తన పాత ఇళ్ళ నిర్మాణ స్థానంలో వాటిని కూల్చి ఆ ప్రదేశంలో కాంప్లెక్స్ లేదా అపార్ట్మెంట్ నిర్మించాలనే యోచన చేస్తున్నారనే విషయందగ్గరనుంచి ఈప్రాంత ప్రజలకు అన్నివిషయాలు తెలుసు. ఐతే నిర్మాణం ఒకస్థాయికొచ్చే సరికి ఇది కళ్యాణ మండపం అనేవిషయం ఇక్కడి ప్రజలకు అర్థం కాలేదు. నిర్మాణానంతరం నిర్వహణ సమస్యలతో మొదటి భవన యజమాని కొందరికి విక్రయించడం జరిగింది. ప్రజలకు అక్కడనుంచి సమస్యలు తీవ్రతరం కావడం మొదలైనది. ఇది ఆక్రమణ నిర్మాణం...ఆక్రమిత నిర్మాణం, నియమ నిబందనలకు విరుద్ధమైనది గనుక దీనిని ఫంక్షన్ హాల్ గా మూసి వెయ్యాల్సినదిగా ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటివరకు ఈ హాల్ లో 30 కార్యక్రమాలకు పైగా జరిగాయి.
ఇన్నాళ్ళు వీరు సాగిస్తూ వస్తున్న చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు:
- పార్కింగ్ కు వినియోగించాల్సిన సెల్లార్ ను వంటకి మాత్రమే ఉపయోగిస్తున్నారు.
- ఇక్కడ పెట్టాల్సిన వాహనాలను రోడ్లపై , వీధుల్లోకి స్థానికులు వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డంగా పెట్టి తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నారు.
- నిబంధనలకు విరుద్ధంగా క్రాక్రరీతో హడాలేత్తిస్తున్నారు. నడిరోడ్డుపై విపరీత మైన శబ్ధమొచ్చే మందుగుండు సామానులను పేలుస్తూ దోవన పోయేవారిని....ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఇక్కడి ప్రజలను హడాలేత్తిస్తున్నారు.
- హాల్ ముందున్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే గాకుండా శాశ్వత నిర్మాణంగా అలంకరించి శుభ్రపరచడానికి వీలుగా ఉంచాల్సిన పంచాయితీ కాలువను కప్పివేశారు.
- వ్యక్తిగతంగా వేయించుకున్న ట్రాన్స్ ఫార్మ్ ను వారి స్థలంలో కాకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించి ప్రజలకు ప్రమాద పరిస్థితులను కలిగేలా చేసారు.
- ఏది జరిగినా ఫంక్షన్ హాల్ లోపలే జరగాల్సి ఉండగా ఆర్కెస్ట్రా ను ఆక్రమిత ప్రాంతంలో పెట్టి భయంకరమైన శబ్దంతో చుట్టుప్రక్కల వారికి కునుకుపడకుండా చేస్తున్నారు.
- వివాహ సందర్భంగా భోజనాల వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేసి పరిసరాలను పాడు చేస్తున్నారు
- పబ్లిక్ వినియోగించే బోర్ వెల్ ను పేల్చి పాడు చేశారు.
- విద్యుత్ దీపాలంకరణ కోసం రోడ్డుకు ఇరువైపులా పాతిన కర్రలు కార్యక్రమానంతం కూడా రోడ్డుపై వెళ్లేవారికి ఆటంకంగా ఉంటూనే ఉన్నాయి.
పై సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువద్దామని విద్యాధికులు సమాజంలో హోదా ఉన్నవారు,పాత్రికేయులు కొందరు మాట్లాడుతుంటే "ఏం చేసుకుంటారో చేసుకోండి" అని సవాలు విసిరారు.ఈ సమస్యలను పోలీసువారికి స్థానికులు ఫిర్యాదు రూపంలో అందించారు. వారు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో నని స్థానికులు ఎదురు చూస్తున్నారు. ప్రజలు సరే ప్రతిరోజూ ఇదే మార్గాన డి.ఎస్పి ఆఫీస్ కు వెళ్ళే పోలీసు అధికారులు ఇన్నాళ్ళు ఎవరు హెచ్చరించక పోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది.
తీగలాగుతున్న స్థానికులు:
" ఏం చేసుకుంటారో చేసుకోండి" నిర్వాహకుడు విసిరిన సవాలుకి స్థానికులు తీగలాగే పనిలో ఉన్నారు.
- ఫంక్షన్ హాల్ నిర్మాణమే చట్ట వ్యతిరేకం.
- ఫైర్ పర్మిషన్ అనుమతి లేదు.
- కోట్లాది రూపాయల ప్రాపర్టీ దారులు, FINANCIERS అయిన వీరు INCOME TAX కడుతున్నారా లేదా?
అనేక వివాదాలకు కారణమైన శ్రీశ్రినివాస ఫంక్షన్ హాల్
గ్రీన్ కార్పెట్ వేసిన ప్రాంతం శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్ వారు ఆక్రమించిన ప్రభుత్వ స్థలం
ఆక్రమించింది ఆక్రమించగా రోడ్డు కు అడ్డుగా ద్విచక్ర వాహనాలు.
సమస్యలను దృష్టికి తెచ్చినవారిపై "ఏం జేసుకుంటారో చేసుకోండి" అని లెక్కలేని తనంగా మాట్లాడుతున్నా ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు.
శారదా నగర్ ఆరవ వీధికి అడ్డుగా పెట్టిన కారును నిర్వాహకులు పట్టించుకోని వైనం.
అందరూ చూస్తుండగానే శక్తివంతమైన బాంబును పెళ్ళివారు బోరింగ్లో పెట్టి పేల్చగా దెబ్బతిన్న పబ్లిక్ బోరింగ్
ఆక్రమిత ప్రభుత్వ స్థలాన్ని చెవులు పగిలిపోయే సౌండ్ లతో ఆర్కెస్ట్రా కి ఉపయోగిస్తున్న దృశ్యం.
రోడ్డుపై ద్విచక్ర వాహనాలను పెట్టిన దృశ్యం
రోడ్డుపై ప్రక్క ఇళ్ళల్లోకి వెళ్ళడానికి అడ్డుగా పెట్టిన వాహనాలు.
ద్విచక్ర వాహనాలకు ఉపయోగించాల్సిన సెల్లార్ ను వంటలకు ఉపయోగిస్తున్న దృశ్యం
ఇంటిలోనుంచి ద్విచక్రవాహనంపై రోడ్డుమీదికి వెళ్ళడానికి వీలులేకుండా అడ్డుగా పెట్టిన కారులు.
వ్యక్తి గతమైన ట్రాన్స్ ఫార్మ్ ను వారి స్థలంలో గాక పబ్లిక్ ప్లేస్ లో ప్రమాదకరంగా ...
ఆక్రమించిన ప్రదేశం క్రింద పూడిక తియ్యడానికి వీలు లేకుండా కప్పివెయ్యబడ్డ ప్రధాన మురుగు కాలువ
స్థానికులు టౌన్ పోలీసు స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు.
ఫిర్యాదు అందుకున్నట్లు ఇచ్చిన రిసిప్ట్
వాణిజ్య పరంగా పబ్లిక్ ప్రదేశాలో కార్య కలాపాలను నిర్వహించే నిర్వాహకులు చుట్టూ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులను కలుగ కుండా ఎలా వ్యవహరించాలో ప్రజల సమక్షంలో శ్రీశ్రీనివాస ఫంక్షన్ హాల్ భాగస్వాముల్లో ఒకరైన వారికి టౌన్ ఎస్.ఐ. సూచనలు చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను ఒక్కొక్కటి తీరుస్తూవస్తున్నట్లు ఎంతో వినయ పూర్వకంగా నిర్వాహకుడు అబద్దాలు ఆడుతున్నాడు గమనించవచ్చు. 25 ఫిబ్రవరి 2012 వరకు ఆతని దృష్టిలో ఒక్కొక్కటి చేసుకు వచ్చాడు ఏమిటంటే...
- హాల్ ను రీ మోడలింగ్ చేయించుకున్నారు
- రంగులు వేయించుకున్నారు
- ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని రోడ్డుమీదికి వచ్చాడు.
- వాస్తవాలను ప్రక్కకు తోసి వాస్తుమీద దృష్టి పెట్టి పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని నిర్మింప జేసుకుంటున్నారు.
- వారి స్థలంలో ఉండాల్సిన ట్రాన్స్ ఫారంను పబ్లిక్ ప్లేస్ లో పెట్టించారు.
- చుట్టుప్రక్కల ప్రజలకు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నారు.